Palwancha: 108 అంబులెన్స్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా సేవల అధికారి!

Palwancha: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 108 సేవల అధికారి కుర్మా సతీష్ కుమార్ శుక్రవారం పాల్వంచ మండలం ఉల్వనూరు పీహెచ్‌సీలో 108 అంబులెన్స్‌ను తనిఖీ చేశారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 27 Nov 2026 9:31 PM IST
Palwancha
X

Palwancha: 108 అంబులెన్స్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా సేవల అధికారి!

పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 108 సేవల అధికారి కుర్మా సతీష్ కుమార్ శుక్రవారం పాల్వంచ మండలం ఉల్వనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో విధులు నిర్వహిస్తున్న 108 అంబులెన్స్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా అంబులెన్స్‌లో అందుబాటులో ఉన్న అత్యవసర వైద్య పరికరాలు, ఆక్సిజన్ సిలిండర్, మందుల నిల్వలు, వాహన నిర్వహణ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అంబులెన్స్ ఎల్లప్పుడూ అత్యవసర సేవలకు సిద్ధంగా ఉండేలా చూడాలని, పరికరాల్లో లేదా వాహన నిర్వహణలో ఏవైనా లోపాలు గుర్తిస్తే వెంటనే సరిచేయాలని సిబ్బందికి సూచించారు.

అత్యవసర కాల్ అందిన వెంటనే ఎలాంటి ఆలస్యం లేకుండా ఘటన స్థలానికి చేరుకుని బాధితులకు ప్రథమ చికిత్స అందిస్తూ సురక్షితంగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని ఆదేశించారు. వైద్య పరికరాలను పరిశుభ్రంగా, వినియోగానికి సిద్ధంగా ఉంచుకోవాలని, వాహన నిర్వహణలో నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు.

ప్రజల ప్రాణాలను కాపాడటమే 108 సేవల ప్రధాన లక్ష్యమని, సిబ్బంది బాధ్యతాయుతంగా, మానవత్వంతో విధులు నిర్వహించాలని కుర్మా సతీష్ కుమార్ సూచించారు. ఈ తనిఖీలో 108 అంబులెన్స్ ఈఎంటీ ఈసం ఉమ, పైలెట్ వేములపల్లి ప్రసాద్ పాల్గొన్నారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN