Bhadrachalam: వారం రోజుల్లో విద్యార్థులకు యూనిఫాంలు అందించాలి: ఐటీడీఏ పీవో!
Bhadrachalam: గిరిజన సంక్షేమ పాఠశాలల్లో వారం రోజుల్లో యూనిఫాంలు పంపిణీ చేయాలని ఐటీడీఏ పీవో బి. రాహుల్ ఆదేశం. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక.
Bhadrachalam: వారం రోజుల్లో విద్యార్థులకు యూనిఫాంలు అందించాలి: ఐటీడీఏ పీవో!
భద్రాచలం సెప్టెంబర్ 18: గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల,వసతి గృహాలలో చదువుతున్న గిరిజన విద్యార్థిని విద్యార్థుల యూనిఫామ్స్ పంపిణీ విషయంలో నిర్లక్ష్య వైఖరి కనబరిస్తే సంబంధిత ఏటిడిఓ, హెచ్ఎం, వార్డెన్లపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ హెచ్చరించారు.
ఈరోజు ఐటీడీఏ కాన్ఫరెన్స్ హాల్ నుండి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు, ఏటీడీవోలు, హెచ్ఎం, వార్డెన్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆశ్రమ పాఠశాలలు వసతి గృహాల విద్యార్థులకు యూనిఫామ్ తో పాటు కల్పించవలసిన మౌలిక వసతులపై సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 25వ తేదీలోగా ప్రతి ఇన్స్టిట్యూషన్లో విద్యార్థినీ విద్యార్థులకు తప్పనిసరిగా యూనిఫామ్ అందేలా సంబంధిత హెచ్ఎం బాధ్యత తీసుకోవాలని, విద్యార్థుల యూనిఫామ్ పంపిణీ బాధ్యత తీసుకున్న ఏపీఎంలు, ఎస్ హెచ్ జి గ్రూపు మహిళలను అధిక సంఖ్యలో నియమించి త్వరగా యూనిఫామ్ కుట్టి త్వరితగతిన పంపిణీ జరిగేలా చూడాలని అన్నారు.
సంబంధిత ఏ టి డి వో లు హెచ్ఎంలు వారి పరిధిలో ఉన్న జిపిఎస్, ఏ హెచ్ ఎస్ పాఠశాలలను తప్పనిసరిగా పర్యవేక్షించి ఉద్దీపకం, విద్యార్థులకు యూనిఫామ్ తయారీ పంపిణీ మరియు వారధికి సంబంధించిన సబ్జెక్టులు విద్యార్థులకు బోధిస్తున్నది లేనిది చూడాలని అన్నారు.
కొన్ని పాఠశాలల్లో టీచర్లు తక్కువ ఉన్నచోట విద్యార్థులకు చదువుకు ఇబ్బంది కలగకుండా సర్దుబాటు చేయడం జరిగిందని, హెచ్ఎంలు రిలీవ్ చేసిన టీచర్లు వెంటనే జాయిన్ కావాలని, రిలీవ్ అయి జాయిన్ కానీ టీచర్లకు సెలవు కింద పరిగణించి వారి వేతనము నిలుపుదల చేయాలని ఏటీడీవోలకు ఆదేశించారు.
హెచ్ఎంలు గనుక రిలీవ్ చేయకపోతే హెచ్ఎం లపై శాఖా పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఏటీడీవోలు, హెచ్ఎంలు మీ పరిధిలో ఉన్న పాఠశాలలను పర్యవేక్షించినప్పుడు తప్పనిసరిగా ఫోటోలు గ్రూపులో పెట్టాలని,లేనియెడల మీరు విధులు సక్రమంగా చేయడం లేదని అనుకోవలసి వస్తుందని అన్నారు.
సంబంధిత ఏ టి డి వో లు, హెచ్ఎంలు బాధ్యతగా పనులు చేయాలని, విధులు నిర్వహించని వారిపై సీరియస్ యాక్షన్ తీసుకునే వరకు కాలయాపన చేయవద్దని హెచ్చరించారు. ఈ నెలలో సీఎంతో సమీక్ష ఉన్నందున ట్రైబల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్లలో తప్పనిసరిగా విద్యార్థులందరికీ యూనిఫామ్ అందేలా చూడాలని అన్నారు.
ఏపీఎంలు సమయాన్నికూలంగా యూనిఫామ్ లు పంపిణీ చేయాలని, యూనిఫామ్ విషయంలో నిర్లక్ష్య వైఖరి కనబరిస్తే సంబంధిత హెచ్ఎంలు వెంటనే డిడి దృష్టికి తీసుకొని రావాలని అన్నారు.
వర్షాకాలం నడుస్తున్నందున ప్రతి ఇన్స్టిట్యూషన్లో మెనూ సక్రమంగా పాటించాలని, పిల్లలు ఎవరు రాత్రిపూట బయటికి రాకుండా చూడాలని, పిల్లలు ఎవరైనా అస్వస్థతకు గురి అయితే వెంటనే దగ్గర్లో ఉన్న పీహెచ్సీలకు తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించాలని, పిల్లల ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
ప్రీ మెట్రిక్స్ స్కాలర్షిప్ నిధులు వచ్చి ఉన్నాయని, సంబంధిత హెచ్ఎం, వార్డెన్ లు ఆశ్రమ పాఠశాలల్లో మీ సేవ కేంద్రం ద్వారా క్యాంపులు పెట్టించి ప్రతి పిల్లవాడికి కులము, నివాసము మరియు ఇన్కమ్ సర్టిఫికెట్లు సంబంధిత ఎమ్మార్వో లను సమన్వయం చేసుకొని జారీ అయ్యేలా చూడాలని, క్యాంపులు పెట్టే సమయానికి పిల్లల యొక్క డాక్యుమెంటేషన్ వారి తల్లిదండ్రులకు తెలియజేసి తెప్పించుకోవాలని అన్నారు.
సంబంధిత ఏటిడీవోలు ముఖ్యంగా యూనిఫాం ఉద్దీపకం, వారధి వర్క్ బుక్ లపై ప్రత్యేక శ్రద్ధ చూపించి విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా చూడాలని అన్నారు.




