Julurupadu: ఏఐఎస్ఎఫ్ అధ్యక్ష కార్యదర్శులుగా దినేష్, అనిల్ ఎన్నిక!

Julurupadu: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షుడిగా బానోత్ దినేష్, కార్యదర్శిగా గుగులోతు అనిల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

SK MAHABOOB JANI, JULURPADU
Published on: 28 Nov 2026 1:02 PM IST
Julurupadu
X

Julurupadu: ఏఐఎస్ఎఫ్ అధ్యక్ష కార్యదర్శులుగా దినేష్, అనిల్ ఎన్నిక!

Julurupadu: స్థానిక జులూరుపాడు మండలం వికాస్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన ఏఐఎస్ఎఫ్ మండల మహాసభ ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోత్ వంశీ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంల ముఖ్య అతిథిగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వరక అజిత్ పాల్గొనీ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం పై విద్యార్థుల్ని యువకుల్ని ఐక్యం చేస్తూ 1936 ఆగస్టు 12న ఉత్తర ప్రదేశ్ లోని లక్నో మహానగరంలో నీ బెనారస్ విశ్వవిద్యాలయంలో పొత్తి ల్లాలో పిడికిలి బిగించి దేశ స్వతంత్రం కోసం పోరాడిన సంఘం అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ అని, నేటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలు మీద విద్యారంగ సమస్యల పరిస్కారం కోసం పోరాడుతుంది.

అదేవిధంగా ఏఐఎస్ఎఫ్ విద్యార్థి ఉద్యమనికి ఒక చరిత్ర ఉందని చదువుతూ పోరాడు చదువుకై పోరాడు నినాదంత తో విద్యార్థులను చైతన్యవంతం చేస్తూ శాస్త్రీయ విధ్య విధానం కోసం మొట్టమొదటిగా ఈ దేశంలో కొట్లాడింది ఏఐఎస్ఎఫ్ అని విద్యా వ్యాపారీకరణకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యార్థులు ఐక్యం కావాలని అందుకోసం ఈ యొక్క ఏఐఎస్ఎఫ్ మండల మహాసభల దోహదపడాలని విద్యారంగ సమస్యల మీద కళాశాలల సమస్యల మీద విద్యార్థులు చైతన్యవంతంగా సమస్యల పరిష్కారం పట్ల ముందుండి పోరాడాలని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘంలో పనిచేయటం మంచి నైతిక విలువలలు కలిగిన నాయకులుగా తయారవ్వడమేనని అన్నారు.

ఈ మహాసభ ద్వారా ఎన్నికైన నూతన జూలూరుపాడు మండల సమితి ప్రభుత్వ విద్యారంగ సమస్యల పట్ల ఉద్యమాలకు సిద్ధం కావాలని రాష్ట్రంలో దేశంలో జరుగుతున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాల మీద ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధి ఏఐఎస్ఎఫ్ విద్యార్థి ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అనంతరం నూతన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్య వ్యతిరేక విధానాలపైన పోరాటాలు కొనసాగిస్తామని అన్నారు.

SK MAHABOOB JANI, JULURPADU

SK MAHABOOB JANI, JULURPADU