Kothagudem: మధుమేహాన్ని ముందుగానే గుర్తించి నియంత్రించుకోవాలి: డీఎంహెచ్‌ఓ
Kothagudem: నవంబర్ 14 ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా మధుమేహాన్ని ముందుగానే గుర్తించి నియంత్రించుకోవాలని భద్రాద్రి జిల్లా డీఎంహెచ్‌ఓ డా. తుకారామ్ రాథోడ్ సూచించారు.
Kothagudem: మధుమేహాన్ని ముందుగానే గుర్తించి నియంత్రించుకోవాలి: డీఎంహెచ్‌ఓ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకొని నవంబర్ 14వ తేదీన ప్రజల్లో మధుమేహ వ్యాధిపై అవగాహన కల్పించాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారామ్ రాథోడ్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మధుమేహం (Diabetes) అనేది రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉండే దీర్ఘకాలిక వ్యాధి అని తెలిపారు. శరీరంలో ఇన్సులిన్ తగినంతగా ఉత్పత్తి కాకపోవడం లేదా ఉత్పత్తి అయిన ఇన్సులిన్ సక్రమంగా పనిచేయకపోవడం వల్ల ఈ వ్యాధి వస్తుందని వివరించారు.
మధుమేహం రావడానికి ముఖ్య కారణాలు:
1. అధిక బరువు మరియు ఊబకాయం.
2. శారీరక శ్రమ లేకపోవడం.
3. కుటుంబంలో మధుమేహ వ్యాధి చరిత్ర ఉండటం.
4. అధిక కొవ్వు, చక్కెర పదార్థాలు కలిగిన ఆహారం తీసుకోవడం.
5. అనారోగ్యకరమైన జీవనశైలి.
6. వయస్సు పెరగడం వంటి అంశాలు.
మధుమేహం లక్షణాలు:
- తరచుగా మూత్ర విసర్జన కావడం.
- అధిక దాహం వేయడం.
- తరచుగా ఆకలి వేయడం.
- కారణం లేకుండా బరువు తగ్గడం.
- నీరసం, అలసట.
- చూపు మందగించడం.
- గాయాలు త్వరగా మానకపోవడం.
మధుమేహ నివారణకు వ్యాయామాలు:
ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు వేగంగా నడవడం, సైక్లింగ్, ఈత, యోగా వంటి వ్యాయామాలు చేయాలి. ఎక్కువసేపు ఒకేచోట కూర్చోకుండా శారీరక చురుకుదనాన్ని పెంచుకోవాలని సూచించారు.
చికిత్స మరియు నియంత్రణ:
మధుమేహం ఉన్నవారు వైద్యుల సలహా మేరకు క్రమం తప్పకుండా రక్తంలో చక్కెర స్థాయిలను పరీక్షించుకోవాలి. అవసరాన్ని బట్టి మందులు లేదా ఇన్సులిన్ తీసుకోవాలి. వైద్యుల సూచన లేకుండా మందులు ఆపకూడదు. కంటి పరీక్షలు, కిడ్నీ పరీక్షలు, పాదాల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి.




