Bhadrachalam: వరంగల్ విమానాశ్రయానికి సమ్మక్క సారలమ్మ పేర్లు పెట్టాలి!

Bhadrachalam: వరంగల్ విమానాశ్రయానికి గిరిజన వీరనారులు సమ్మక్క సారలమ్మ పేర్లు పెట్టాలని డిమాండ్ చేసిన ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక కన్వీనర్ ఇరప రాజు దొర.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 21 Sept 2026 1:55 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: వరంగల్ విమానాశ్రయానికి సమ్మక్క సారలమ్మ పేర్లు పెట్టాలి!

Bhadrachalam: తెలంగాణ ఆదివాసీ చరిత్ర, ఆత్మగౌరవం, వీరత్వానికి ప్రతీకలైన వీరనారులు సమ్మక్క–సారలమ్మ పేర్లను వరంగల్ విమానాశ్రయానికి పెట్టాలని ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ ఇరప. రాజు దొర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

కాకతీయుల కాలంలో అన్యాయానికి, దోపిడీకి వ్యతిరేకంగా సమ్మక్క–సారలమ్మ చేసిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమైనదని ఆయన పేర్కొన్నారు. వారి చరిత్ర కేవలం ఆదివాసీ సమాజానికి మాత్రమే పరిమితమైనది కాదని, తెలంగాణ ప్రజల పోరాట చరిత్రలోనూ ఒక ముఖ్యమైన అధ్యాయమని తెలిపారు.

వరంగల్ ప్రాంతానికి సమ్మక్క–సారలమ్మ చరిత్రతో ఉన్న సాంస్కృతిక, చారిత్రక అనుబంధాన్ని గుర్తిస్తూ విమానాశ్రయానికి సమ్మక్క–సారలమ్మ విమానాశ్రయం” అనే పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. విమానాశ్రయానికి వారి పేర్లు పెట్టడం ద్వారా తెలంగాణ ఆదివాసీ వీరనారుల చరిత్ర, త్యాగం, సంస్కృతి మరియు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసే అవకాశం ఉంటుందని అన్నారు.మా ప్రధాన డిమాండ్.

ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా పేరు ప్రసిద్ధి ఉన్న మేడారం జాతర కావున వరంగల్ విమానాశ్రయానికి వీరనారులు సమ్మక్క–సారలమ్మ పేర్లను అధికారికంగా పెట్టే ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలి.ఈ డిమాండ్‌పై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, సంబంధిత కేంద్ర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక తరఫున కోరుతున్నామని ఇరప. రాజు దొర తెలిపారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem