Aswaraopeta: కేసీఆర్ నిరాహార దీక్ష ఉద్యమంలో కీలక మలుపు: మాజీ ఎమ్మెల్యే మెచ్చా

Aswaraopeta: అశ్వారావుపేటలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఉప్పల వెంకటరమణ ఆధ్వర్యంలో దీక్షా దివస్ నిర్వహించి, ఉద్యమకారులను ఘనంగా సత్కరించారు.

SANKURATHRI SATISH, ASWARAOPETA
Published on: 29 Nov 2026 8:10 PM IST
Aswaraopeta
X

Aswaraopeta: కేసీఆర్ నిరాహార దీక్ష ఉద్యమంలో కీలక మలుపు: మాజీ ఎమ్మెల్యే మెచ్చా

అశ్వారావుపేట: అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో అశ్వారావుపేట మాజీ MLA,BRS పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు గారి అధ్యక్షతన మరియు రాష్ట్ర నాయకులు, సభ్యత్వ నమోదు ప్రక్రియ మరియు MLC ఎన్నికల ఇంచార్జ్ ఉప్పల వెంకట రమణ గారి పర్యవేక్షణలో దీక్ష దివస్ కార్యక్రమం జరిగింది.

ముందుగా కెసిఆర్ గారి ఉదయమా సమయ ఫోటో గ్యాలరీని వీక్షించారు.అనంతరం అమరవీరుల స్థూపానికి పూల మాల వేసి నివాళులర్పించి అనంతరం గౌ.కెసిఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అలాగే ఉద్యమకారులకు ఘనంగా శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఓ మహా నాయకుడు కెసిఆర్ గారని“కేసీఆర్ సచ్చుడో… తెలంగాణ వచ్చుడో! కేసీఆర్ శవయాత్రనా… తెలంగాణ జైత్ర యాత్రనా… ఏదో ఒకటి తేలాలి! అంటూ ఒక మహానాయకుడు గర్జించిన రోజు… నవంబర్ 29, 2009.ఒక నినాదం… ఒక సమరనాదం… యావత్ తెలంగాణ జాతిని ఏకం చేసిన రోజు!.ఆ పదకొండు రోజుల నిరాహార దీక్ష… పోరాట సముద్రం పోటెత్తి సునామీ సృష్టించిన రోజులు!అగ్నిపర్వతం బద్దలైనట్టు… భూకంపం సంభవించినట్టు… పెనుతుఫాను తీరాన్ని తాకినట్టు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది.

అందరూ ఒక్కటై రోడ్లపైకి వచ్చిన రోజు.“విడువం… వదలం… తెలంగాణ సాధించి తీరుతాం!”అంటూ ఉద్యమ బాట పట్టారని.తెలంగాణ ఆత్మగౌరవం కోసం, స్వరాష్ట్ర సాధన కోసం సాగిన ఆ మహా పోరాటంలో కేసీఆర్ గారి నిరాహార దీక్ష ఒక కీలక మలుపుగా నిలిచింది.ఆ దీక్షా పోరాటాన్ని, తెలంగాణ ప్రజల ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం నవంబర్ 29న దీక్షా దివస్ జరుపుకుంటున్నామని..కోట్లాది సాధించుకున్న రాష్ట్రాన్ని 10 ఏండ్ల పాటు ఎవరికి ఏ లోటు లేకుండా పరిపాలిస్తే..మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో 5మండలాల మాజీ అధ్యక్షులు,మాజీ ఎంపీపీలు,మాజీ ZPTC లు,తాజా మాజీ సర్పంచ్లు,మండల నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.

SANKURATHRI SATISH, ASWARAOPETA

SANKURATHRI SATISH, ASWARAOPETA