Sathupalli: దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ తల్లి, అమరులకు సండ్ర ఘన నివాళి!
Sathupalli: దీక్షా దివస్ సందర్భంగా సత్తుపల్లిలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలంగాణ తల్లి విగ్రహానికి, అమరవీరుల స్థూపానికి ఘన నివాళులర్పించారు.
Sathupalli: దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ తల్లి, అమరులకు సండ్ర ఘన నివాళి!
సత్తుపల్లి: సత్తుపల్లి పట్టణంలో దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు.
అనంతరం అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష, అమరవీరుల పోరాటాలు, త్యాగాలు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.




