Yellandu: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి: అవునూరి మధు!
Yellandu: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని న్యూడెమోక్రసీ నేత అవునూరి మధు డిమాండ్ చేశారు. జనవరి 27 నుంచి మహా పాదయాత్ర చేపట్టనున్నారు.
Yellandu: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి: అవునూరి మధు!
ఇల్లందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ను కరువు జిల్లా గా ప్రకటించాలని న్యూడెమోక్రాసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అవునూరి మధు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక న్యూడెమోక్రసీ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడారు. ఎల్ నినో ప్రభావం తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ను పూర్తి స్థాయిలో కరువు ప్రాంతంగా ప్రకటించడం లో నిర్లక్ష్యంగా వ్యవహారిస్తుందని ఆరోపించారు.
జిల్లాలోని కొన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి మిగతా మండలాలను విస్మరించడం తగదని పేర్కొన్నారు. ఎల్ నీనో ప్రభావంతో రైతులు పంటలు పండక అప్పుల పాలై ఇబ్బందులు పడుతుంటే రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వమే సవతి తల్లి ప్రేమ చూపించడం తగదని హితవు పలికారు. భద్రాది కొత్తగూడెం జిల్లాకు కరువు రావడానికి ఈ జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరావు కారణమని ఆరోపించారు.
భద్రాద్రి జిల్లాలో ఉన్న సీతారాం ప్రాజెక్టు నీళ్లను జిల్లా రైతుల భూములకు నీళ్లు పారించకుండా సత్తుపల్లి,పాలేరు,ఖమ్మం రైతులకు తరలించి కరువు రావడానికి కారకుడు అయ్యాడని ఆరోపించారు. భద్రాద్రి జిల్లా రైతులను ఆదుకోవాలని జిల్లాను కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో జనవరి 27 నుండి మహా పాదయాత్ర జీపు యాత్ర నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
ఈ పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజలు రైతులు రాజకీయ పక్షాలు మద్దతు తెలిపాలని కోరారు. అదేవిధంగా పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, సీతారామ ప్రాజెక్టు నీళ్లు జిల్లా రైతుల భూములకు పారే విధంగా నీళ్లు కేటాయించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని మధు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు తుపాకుల నాగేశ్వరావు,గౌని నాగేశ్వరరావు, ఎదలపల్లి సత్యం, బట్టు ప్రసాద్, పోలారం సర్పంచ్ జరుపల అంజలి తదితరులు పాల్గొన్నారు.




