Khammam: మార్క్‌ఫెడ్‌లో డీసీఎంఎస్ విలీనంపై ఈ నెల 28న మహాజనసభ: శ్రీనివాస రెడ్డి!
Khammam: మార్క్‌ఫెడ్‌లో డీసీఎంఎస్ విలీనంపై ఈ నెల 28న ఉదయం 11 గంటలకు ఖమ్మం డీసీసీబీ కార్యాలయంలో మహాజనసభ నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి తెలిపారు.
Khammam: మార్క్‌ఫెడ్‌లో డీసీఎంఎస్ విలీనంపై ఈ నెల 28న మహాజనసభ: శ్రీనివాస రెడ్డి!
ఖమ్మం: జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ (DCMS)ని మార్క్ ఫెడ్ (MARKFED) లో విలీనం చేసే అంశంపై మహాజనసభ నిర్వహించి, సభ్యుల అభిప్రాయాలను సేకరించి నివేదించాలని రాష్ట్ర సహకార శాఖ కమిషనర్ రాహుల్ రాజ్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారని డీసీఎంఎస్ సంస్థ పర్సన్ ఇన్ ఛార్జ్, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. శ్రీనివాస రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఇట్టి ఆదేశాల మేరకు, ఈ నెల 28వ తేదీన ఉదయం 11:00 గంటలకు ఖమ్మంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (DCCB) ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో ఖమ్మం జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ మహాజనసభను నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ అన్నారు.
ఇట్టి సమావేశంలో డీసీఎంఎస్ ను మార్క్ ఫెడ్ లో విలీనం చేసే అంశంతో పాటు, సంస్థకు సంబంధించిన ఆస్తులు, ఇతర ముఖ్య అంశాలపై విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు. విలీన ప్రక్రియపై సభ్యులకు ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే, ఈ సమావేశంలో నేరుగా తెలియజేయవచ్చని సూచించారు.
డీసీఎంఎస్ లో సభ్యులుగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (PACS) అధ్యక్షులు, బి-క్లాస్ సభ్యులు, సహకార శాఖ అధికారులు ఈ సమావేశానికి విధిగా హాజరుకావాలని అదనపు కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి, ఖమ్మం కార్యాలయంచే జారీచేయనైనది.




