Yellandu: ఇల్లందులో ఘనంగా దసరా వేడుకలు.. ఫారెస్ట్ గ్రౌండ్‌లో ఏర్పాట్లు!
Yellandu: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఈసారి దసరా వేడుకలు ఫారెస్ట్ గ్రౌండ్‌లో ఘనంగా నిర్వహించనున్నట్లు మున్సిపల్ చైర్ పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర వెల్లడించారు.
Yellandu: ఇల్లందులో ఘనంగా దసరా వేడుకలు.. ఫారెస్ట్ గ్రౌండ్‌లో ఏర్పాట్లు!
Yellandu: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో దసరా వేడుకలు ఈసారి ఫారెస్ట్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్నట్లు ఇల్లందు మునిసిపల్ చైర్ పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర తెలిపారు. మంగళవారం ఫారెస్ట్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో మునిసిపల్ చైర్ పర్సన్ కిరణ్ మిత్ర మాట్లాడుతూ ఇల్లందు దసరా ఉత్సవాలు మైసూర్ తలపించే విదంగా ఉంటాయని, ఈ ఏడాది సైతం ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆహ్లాదకరంగా జబర్దస్త్ టీం డాన్స్ గాయకులు మిమిక్రీ కళాకారులతో సందడిగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
మా పాలకవర్గం ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక గుర్తింపు లభించేలా ఎక్కడ తగ్గకుండా వేడుకలు నిర్వహించాలని ఎమ్మెల్యే కోరం కనకయ్య పాలకవర్గం సహకారంతో మూడు నెలల పాటు శ్రమించి అటవీ శాఖ మైదానంలో వేడుకలు నిర్వహించేందుకు చేసిన కృషి ఫలించిందన్నారు.
కమిషనర్ సందీప్ మాట్లాడుతూ మైసూర్ తీరున ఇల్లందులో జరిగే వేడుకలు ఎక్కడ లోటు లేకుండా ఘనంగా నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సమావేశం లో కౌన్సిలర్ లు ఎండి జాఫర్,సైదా మియా,అజ్మీరా వంశీ,నీలాపు రమేష్, కోఆప్షన్ సభ్యులు సాంబమూర్తి, నాయకులు దొడ్డ డానియల్,సుదర్శన్ కోరి, మేకల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.




