Kothagudem: మురసు తుఫాన్: భద్రాద్రి జిల్లాలో విస్తారంగా వర్షాలు!
Kothagudem: మురసు తుఫాను ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా అశ్వారావుపేటలో 65 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Kothagudem: మురసు తుఫాన్: భద్రాద్రి జిల్లాలో విస్తారంగా వర్షాలు!
భద్రాద్రి కొత్తగూడెం: మురసు తుఫాను ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. జిల్లావ్యాప్తంగా 32 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. అశ్వారావుపేటలో అత్యధికంగా 65 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై భారీ వర్షం కురిసిన ప్రాంతంగా నిలిచింది. దమ్మపేట మండలంలోని పలు గ్రామాల్లోనూ భారీ వర్షం నమోదైంది. వర్షపాతం వివరాల ప్రకారం దమ్మపేట మండలం నాయుడుపేటలో 59.0 మి.మీ., మల్కారంలో 57.3 మి.మీ., మండలపల్లిలో 48.0 మి.మీ., అంకంపాలెంలో 42.8 మి.మీ., నాగుపల్లిలో 40.0 మి.మీ. వర్షం కురిసింది.
అలాగే అన్నపురెడ్డిపల్లి మండలం పెంట్లంలో 36.5 మి.మీ., చంద్రుగొండ మండలం మద్దుకూరులో 27.5 మి.మీ., ములకలపల్లిలో 25.5 మి.మీ., లక్ష్మీదేవిపల్లిలో 21.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. కొత్తగూడెం ఓల్డ్లో 15.5 మి.మీ., భద్రాచలం గోదావరి బ్యాంక్ వద్ద, సుజాతనగర్లో 12.0 మి.మీ. చొప్పున, టేకులపల్లిలో 11.3 మి.మీ., ఇల్లందులో 10.5 మి.మీ. వర్షం కురిసింది.
ఆళ్లపల్లిలో 1.3 మి.మీ., కరకగూడెంలో 1.0 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇదిలా ఉండగా జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు 22.1 నుంచి 25.5 డిగ్రీల సెల్సియస్ వరకు, గరిష్ట ఉష్ణోగ్రతలు 23.2 నుంచి 29.1 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యాయి. దమ్మపేట మండలం మల్కారం, అంకంపాలెంలో అత్యల్పంగా 22.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.




