Sathupalli: సత్తుపల్లిలో ఘనంగా సైబర్ సెక్యూరిటీ ఫ్లాష్ కార్యక్రమం!

Sathupalli: ఖమ్మం జిల్లా సత్తుపల్లి జేవీఆర్ కాలేజీ గ్రౌండ్‌లో సైబర్ సెక్యూరిటీ ఫ్లాష్ అవగాహన కార్యక్రమం. 2000 మంది విద్యార్థులతో మొబైల్ ఫ్లాష్ లైట్ ర్యాలీ నిర్వహణ.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 1 Nov 2026 8:06 AM IST
Sathupalli
X

Sathupalli: సత్తుపల్లిలో ఘనంగా సైబర్ సెక్యూరిటీ ఫ్లాష్ కార్యక్రమం!

Sathupalli: ఖమ్మం CP సునీల్ దత్ సార్, Addl డీసీపీ సార్ మరియు ACP కల్లూరు గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు సత్తుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జేవిఆర్ కాలేజీ గ్రౌండ్ నందు సాయంత్రం 6 గంటలకు CYBER SECURITY FLASH అనే సైబర్ అవేర్నెస్ ప్రోగ్రాం మరియు ఆ తర్వాత JVR కాలేజ్ గ్రౌండ్ నుంచి రింగ్ సెంటర్ వరకు వెళ్ళి రిటర్న్ JVR కాలేజ్ వరకు మొబైల్ ఫ్లాష్ ఆన్ చేసుకొని ర్యాలీ నిర్వహించడం జరిగింది.

ఇట్టి కార్యక్రమంలో సుమారు 2000 మంది వరకు వివిధ కళాశాలల విద్యార్థిని విద్యార్ధులు, సత్తుపల్లి PS పరిధిలోని ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.

ఇట్టి కార్యక్రమంలో ఖమ్మం కమిషనరేట్ సైబర్ సెల్ ACP ఫణింధర్ గారు, సత్తుపల్లి ఇన్స్పెక్టర్ తుమ్మలపల్లి శ్రీహరి మరియు సత్తుపల్లి PS సిబ్బంది & సైబర్ PS ఇన్స్పెక్టర్ రవి కుమార్ మరియు సిబ్బంది పాల్గొని OTP ఫ్రాడ్, జాబ్ ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్, ఫేక్ లోన్ ఆప్స్.... మొదలగు సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించడం జరిగింది.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI