Mulakalapally: నేడు తిమ్మంపేటలో పంట నష్టం పరిశీలన.. రైతులు వివరాలు నమోదు చేసుకోవాలి
Mulakalapally: మురసు తుపాను వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు అధికారులు నేడు తిమ్మంపేటకు రానున్నారని, రైతులు వివరాలు నమోదు చేసుకోవాలని సర్పంచ్ తెలిపారు.
Mulakalapally: నేడు తిమ్మంపేటలో పంట నష్టం పరిశీలన.. రైతులు వివరాలు నమోదు చేసుకోవాలి
ములకలపల్లి: ములకలపల్లి ఇటీవల సంభవించిన మురసు తుపాను ప్రభావంతో నష్టపోయిన పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు మంగళవారం (10-11-2026) వ్యవసాయ శాఖ అధికారులు మండలంలోని తిమ్మంపేట పంచాయతీకి రానున్నట్లు స్థానిక గ్రామ సర్పంచ్ తుర్రం శ్రీనివాసరావు తెలిపారు.
తుపాను వల్ల తిమ్మంపేట పరిసరాల్లోని పలువురు రైతులు సాగు చేసిన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పంట నష్టపోయిన రైతులందరూ మంగళవారం గ్రామానికి విచ్చేసే వ్యవసాయ అధికారుల వద్ద తమ దెబ్బతిన్న పొలాల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
బాధిత రైతులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ప్రభుత్వం నుంచి అందే సహాయానికి అర్హత పొందేలా వివరాలు సమర్పించాలని ఆయన కోరారు.




