Garla: గార్ల ఆసుపత్రిలో డాక్టర్లు, మందుల కొరత.. సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా!

Garla: గార్ల కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు, మందుల కొరతను నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు.

NARASIMHARAO, BAYYARAM
Published on: 3 Nov 2026 1:41 PM IST
Garla
X

Garla: గార్ల ఆసుపత్రిలో డాక్టర్లు, మందుల కొరత.. సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా!

Garla: మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ) ఎదుట సీపీఎం గార్ల మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీఎం నాయకులు మాట్లాడుతూ గార్ల CHC పరిధిలో దాదాపు 3 వేల మంది ప్రజలు వైద్య సేవల కోసం వస్తున్నారని, అందుకు తగ్గట్టుగా తగినంత మంది డాక్టర్లు, సిబ్బంది లేరని ఆరోపించారు. ఏజెన్సీ ప్రాంతంలో పనిచేస్తున్న డాక్టర్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

అలాగే గత రెండు రోజులుగా బీపీ పేషెంట్లకు సంబంధించిన 40mg మాత్రలతో సహా పలు రకాల మందులు అందుబాటులో లేవని, గత కొన్ని నెలలుగా కొన్ని రకాల రక్త పరీక్షలు నిలిపివేయడంతో, కొన్ని పరీక్షలు మాత్రమే అందుబాటులో ఉండటంతో పేద, గిరిజన ప్రజలు ప్రైవేట్ ల్యాబ్ లలో డబ్బులు పెట్టి పరీక్షలు చేయించుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డాక్టర్ బాలునాయక్ కు అందించారు.

NARASIMHARAO, BAYYARAM

NARASIMHARAO, BAYYARAM