Kothagudem: కొత్తగూడెంలో ఘనంగా గుగులోత్ ధర్మ మూడవ వర్ధంతి వేడుకలు!
Kothagudem: కొత్తగూడెం మంచికంటి భవన్‌లో సీపీఎం నాయకుడు గుగులోత్ ధర్మ మూడవ వర్ధంతిని నిర్వహించారు.
Kothagudem: కొత్తగూడెంలో ఘనంగా గుగులోత్ ధర్మ మూడవ వర్ధంతి వేడుకలు!
Kothagudem: గుగులోత్ ధర్మ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ అంకితమై పనిచేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. కొత్తగూడెంలోని మంచికంటి భవన్‌లో సీపీఎం నాయకుడు గుగులోత్ ధర్మ మూడవ వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు లిక్కి బాలరాజు అధ్యక్షతన నిర్వహించారు. తొలుత ధర్మ చిత్రపటానికి మచ్చా వెంకటేశ్వర్లు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే వామపక్ష రాజకీయాల పట్ల ఆకర్షితుడై, తుదిశ్వాస విడిచే వరకు ఎర్రజెండా నీడలో ప్రజా ఉద్యమాల్లో కొనసాగిన ధన్యజీవి గుగులోత్ ధర్మ అని కొనియాడారు. మంగపేట గ్రామంలో పేదలకు ఇళ్ల స్థలాలు కల్పించేందుకు తన తండ్రిని ఎదిరించి ఆరు ఎకరాల భూమిని పేదలకు అందించిన గొప్ప త్యాగశీలి అని గుర్తుచేశారు.
గిరిజన సంఘం రాష్ట్ర నాయకుడిగా, ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకుడిగా గిరిజన ఉద్యమాల నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. కొత్తగూడెం, ఇల్లందు, సుజాతనగర్ ప్రాంతాల్లో పార్టీ నిర్మాణానికి విశేష కృషి చేశారని పేర్కొన్నారు. జూలూరుపాడు జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికై ఆదర్శ ప్రజాప్రతినిధిగా ప్రజల మన్ననలు పొందారని అన్నారు.
అనారోగ్యంతో చివరి దశలో ఉన్నప్పటికీ రైతాంగ ఉద్యమాల్లో పాల్గొని కార్యకర్తలకు స్ఫూర్తినిచ్చారని గుర్తుచేశారు. ఆర్థిక దోపిడీ, సామాజిక అణచివేత లేని సమసమాజ స్థాపనే లక్ష్యంగా చివరి వరకు సీపీఎంలో కొనసాగిన ధర్మ నేటి తరానికి ఆదర్శమని అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కమ్యూనిస్టు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య, ఏజే రమేష్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ, రేపాకుల శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు భూక్య రమేష్, నాయకులు కే. సమ్మయ్య, వై. వెంకటేశ్వరరావు, వాంకుడోత్ అమర్‌సింగ్, పప్పుల ప్రమోద్, శివ, సలీం, విజయమోహన్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.




