Kothagudem: ఆర్టీసీ పరిరక్షణ కోసం ఐక్య కూటమిని గెలిపించాలి!

Kothagudem: కొత్తగూడెం ఆర్టీసీ డిపో వద్ద ఎస్‌డబ్ల్యూఎఫ్, టీఎంయూ, టిడబ్ల్యూయూ, ఐఎన్‌టీయూసీ ఐక్య కూటమి అభ్యర్థుల తరఫున విస్తృత ప్రచారం నిర్వహించిన సీపీఎం జిల్లా కార్యదర్శి.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 6 Oct 2026 5:28 PM IST
Kothagudem
X

Kothagudem: ఆర్టీసీ పరిరక్షణ కోసం ఐక్య కూటమిని గెలిపించాలి!

Kothagudem: ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎస్‌డబ్ల్యూఎఫ్, టీఎంయూ, టిడబ్ల్యూయూ, ఐఎన్‌టీయూసీ ఐక్య కూటమికి మద్దతు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు కోరారు. మంగళవారం కొత్తగూడెం ఆర్టీసీ బస్ డిపో వద్ద సీపీఎం నాయకులు ఐక్య కూటమి అభ్యర్థుల తరఫున విస్తృత ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా మచ్చా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, కార్మికుల హక్కుల కోసం ఐక్య కూటమి నిరంతరం పోరాడుతుందని అన్నారు. గతంలో 55 రోజుల సమ్మె సందర్భంగా కార్మికులు చేపట్టిన పోరాటాన్ని ఆయన గుర్తుచేశారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా ప్రైవేటు సంస్థలకు పనులు అప్పగించే విధానాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

కార్మికులకు మెరుగైన పే స్కేల్ సాధన, పని భారం తగ్గింపు, డిపోల్లోని సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో బాణం గుర్తుకు, రీజియన్‌లో నక్షత్రం గుర్తుకు ఓటు వేయాలని కోరారు.

కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి భూక్య రమేష్, లిక్కి బాలరాజు, బత్తుల నాగేశ్వరరావు, ఇస్నాపల్లి శామ్యూల్, అనిల్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM