Garla: పినిరెడ్డిగూడెంలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్!
Garla: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పినిరెడ్డిగూడెంలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు.
Garla: పినిరెడ్డిగూడెంలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్!
Garla: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పినిరెడ్డిగూడెం గ్రామంలో మంచి నీటి ఏద్దడి నివారణకు ప్రత్యేక ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేసి శాశ్వతంగా మంచి నీటి ఎద్దడి నివారించాలని సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు వంగూరి వెంకటేశ్వర్లు,మల్లెల.నాగమణి లు డిమాండ్ చేశారు.
పినిరెడ్డి గూడెంలో సుందరయ్య కాలనీ లో బి.నరేష్ అధ్యక్షతన జరిగిన సిపిఎం గ్రామ శాఖ సమావేశం లో ఆమె మాట్లాడుతూ.. మంచినీటి బావి ఉన్నప్పటికీ లో ఓల్టేజ్ కారణం గా మంచి నీటి సమస్య పదే పదే వస్తుందని,ట్రాన్స్ ఫార్మర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలన్నారు.
పోచారం క్రాస్ రోడ్డు నుండి ప్రతిరోజు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో మహిళలు వివిధ పనుల రిత్యా పట్టణాలకు వెళ్లి సుమారుగా అర కిలోమీటర్ దూరం వరకు చీకట్లో ఖాళీ నడకన ప్రయాణం చేయాల్సి వస్తుందని విద్యుత్ అధికారులు, పంచాయతీ అధికారులు స్పందించి వీధిలైట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో మండల నాయకులు చింత ఎల్లయ్య,శాఖ కార్యదర్శి వంగూరి కొండయ్య,వార్డు సభ్యులు,శాఖ సభ్యులు గుగులోత్ సీతరాo,బానోత్ ఝాన్సీ,బానోత్ నరేష్,యం.వెంకట్, మాజీ ఎంపీటీసీ పద్మ ఉన్నారు.




