Kothagudem: సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు ప్రెస్‌మీట్!
Kothagudem: కొత్తగూడెంలో మంచికంటి భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించిన సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు. జిల్లా అభివృద్ధిపై తీవ్ర విమర్శలు.
Kothagudem: సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు ప్రెస్‌మీట్!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధిలో ఆమడ దూరంలో ఉందని, ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ జిల్లా పట్ల వివక్షత చూపిస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు విమర్శించారు. స్థానిక మంచికంటి భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముగ్గురు మంత్రులు ఉన్నా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధి కోసం ప్రణాళిక బద్ధమైన కృషి చేయడం లేదని విమర్శించారు. ఆర్భాటపు ప్రచారాలు తప్ప ఆచరణలో ఇసుమంత కూడా అభివృద్ధి లేదన్నారు. అసలు నిధులు కేటాయించకుండానే సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగునీటిని అందిస్తామని మంత్రులు ప్రగల్భాలు పలుకుతున్నారన్నారనీ విమర్శించారు.
సీతారామ ప్రాజెక్టు నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయకుండా మాట మాటలు, మోసపూరిత ప్రకటనలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే వరకు పోరాటాల కొనసాగిస్తామని తెలిపారు.
సిపిఎం ఆద్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విద్యా, వైద్యం పై నిర్వహించిన సర్వేలో ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ గిరిజన, సామాజిక సంక్షేమ హాస్టళ్లు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయనీ తెలిపారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో పర్మినెంట్ వైద్య సిబ్బంది, మందులు,సిరంజీలు కూడా లేకపోవడం, సిగ్గుచేటన్నారు.జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల రక్త పరీక్షలు నిలిచిపోయాయన్నారు. జిల్లా కేంద్ర ఆసుపత్రి అభివృద్ధికి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రకటించిన మూడు కోట్ల రూపాయలు ఎటు పోయాయో అర్థం కావడం లేదన్నారు.సంక్షేమ హాస్టళ్లు నిదులు లేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు.
టాయిలెట్లు, మరుగుదొడ్ల సమస్య విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్యాన్లు, లైట్లు కూడా పనిచేయడం లేదన్నారు.టీచర్లు, లెక్చరర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు.ఏజెన్సీ జిల్లా పట్ల ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపిస్తుందన్నారు.
వెంటనే ప్రభుత్వ విద్యాలయాలు, ఆసుపత్రుల్లో పర్మినెంట్ సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు.మౌలిక సదుపాయాల కల్పనకు తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
మొండి గోడలకు ఎన్ని సార్లు పట్టాలిస్తారు?
బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒకసారి మొండి గోడలకు పట్టాలిచ్చి, మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కూడా మళ్ళీ మొండి గోడలకే పట్టాలి ఇవ్వడం సరి అయినది కాదన్నారు.ఇలా మొండి గోడలకు డ్రా తీసి ఇల్లు ఇచ్చామని చెప్పుకోవడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు.స్థానిక ఎమ్మెల్యేకే తెలియకుండా ప్రభుత్వం పట్టాల పంపిణీ కార్యక్రమం పెట్టడం విడ్డూరంగా ఉందని అన్నారు.
పాత కొత్తగూడెం ఇళ్ల స్థలాల పోరాటం కాసాని ఐలయ్య నాయకత్వంలో సిపిఎం నిర్వహించిందని గుర్తు చేశారు.రెండు వేల ఆరువందల అరవై మంది లబ్ధిదారులను గుర్తించి రెండు వందల పద్నాలుగు మందికే ఇస్తే, మిగతా లబ్ధిదారులందరికీ ఎపుడు ఇస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పాల్వంచలో ఏకపక్షంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు చేశారని విమర్శించారు. అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న పేదలని వదిలేసి ఇలా ఎటువంటి సర్వేలు నిర్వహించకుండా లబ్ధిదారులు ఎంపిక చేయడం తగదన్నారు.
పాల్వంచ, కొత్తగూడెంలో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జిల్లావ్యాప్తంగా రహదారులు ధ్వంసం అయినా మంత్రులు అధికారులు చోద్యం చూస్తున్నారన్నారు. గోదావరి నదికి అటువైపు ఇటువైపు భద్రాచలం నియోజకవర్గం పినపాక నియోజకవర్గం లో ద్వంసమైన రహదారుల్ని వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు. ఇసుక ద్వారా ఆదాయం అందుతున్న ప్రభుత్వం రహదారుల నిర్మాణాన్ని మరిచిందన్నారు. దీంతో పేదలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న భూమి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముగ్గురు మంత్రులు ఉన్న నిధుల కేటాయింపులో జిల్లాకు అన్యాయం జరుగుతుందని విమర్శించారు. కళ్ళకు కట్టినట్టుగా విద్యాలయాలను చూసినా, ప్రభుత్వ వైద్యశాలలను చూసినా నిధుల లేమితో సతమతమవుతున్నాయన్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రజలను, కలిసోచ్చే శక్తులను కలుపుకొని ప్రజా పోరాటాలకు సిద్ధం అవుతామని తెలిపారు.
గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న పేదలకు పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలి
సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య
జిల్లాలో చుంచుపల్లి కొత్తగూడెం ఇల్లందు చర్ల ప్రాంతాలలో ఇళ్ల స్థలాలు లేని పేదలు గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారని మా ప్రజలకు స్థలం ఇచ్చి పక్కా ఇంటి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న ప్రజలు కరెంటు మంచినీటి సౌకర్యం లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతూ జీవనాన్ని కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి కనికరం కలగడం లేదని విమర్శించారు. గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న పేదలకు పక్కా ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
సీతారామ ప్రాజెక్టు నిర్మాణం కొరకు కేటాయించిన నిధులను ఖర్చుపెట్టకుండా ప్రాజెక్టు ద్వారా ప్రజలకు నీళ్లు ఎలా అందిస్తారని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్నా అభివృద్ధి చేయడంలో చిత్తశుద్ధి లేదన్నారు. ఫలితంగా జిల్లా ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే బ్రహ్మచారి, లిక్కి బాలరాజు రేపాకుల శ్రీనివాస్ పాల్గొన్నారు.




