Bhadrachalam: పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలి: భద్రాచలం సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం!

Bhadrachalam: విద్యుత్ చార్జీల తగ్గింపు, 1/70 చట్టం అమలు, ఇసుక అక్రమ రవాణా నివారణపై భద్రాచలం సబ్ కలెక్టర్‌కు సీపీఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు వినతిపత్రం అందజేశారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 6 Oct 2026 6:28 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలి: భద్రాచలం సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం!

భద్రాచలం అక్టోబర్ 06: విద్యుత్ చార్జీలు తగ్గించాలి అర్హులైన పేదలకు పెన్షన్లు అందించాలి నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని CPIML మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన సందర్భంగా K రంగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల విద్యుత్ చార్జీలు పెంచుతూ సర్కులర్లు ఇవ్వడానికి నిరసిస్తూ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.

విద్యుత్ చార్జీలు తగ్గేంతవరకు పోరాటాలు నిర్వహించాలని ఆయన రాష్ట్ర ప్రజలతో పిలుపునిచ్చారు. విద్యుత్ చార్జీలు పెంచి అదనంగా ప్రజల కు భారంగా మారుతాయి అని ఆయన అన్నారు. రాష్ట్రంలో అర్హులైన వారందరికీ గుర్తించి పెన్షన్లు అందజేయాలని ఆయన తెలిపారు. ఇప్పటికే అనేకమందికి అర్హులైన వారికి పెన్షన్లు దాకా ఇబ్బందులు పడుతున్నారని వారిని వెంటనే గుర్తించి వారికి పెన్షన్ అందజేయాలని వారు డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఈ ధరలు పెరగడం వల్ల ప్రజల అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన గుర్తు చేశారు. నిత్యవసర సరుకులు ధరల్ని తగ్గించకుంటుంటే ప్రజలు ఇబ్బందులు పాలవుతారని ఆయన తెలిపారు బియ్యం పప్పు ఉప్పు ధరలు ఇప్పటికే పెరగడం వల్ల ప్రజల అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఐక్యంగా పోరాడి ధరలను తగ్గించేంతవరకు ప్రజల పోరాటం నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.

భద్రాచలం నియోజవర్గంలో ఇసుక లారీల బెడద రోజురోజుకీ ఎక్కువ అవుతుందని ఇసుక ర్యాంపుల వల్ల రోడ్లు పూర్తిగా దంశమైపోయాయని గర్భిణీ స్త్రీలు, వికలాంగులు, ముసలి వారు ప్రయాణం చేయాలంటే అనేక ఇబ్బందులకు గురవుతున్నారని హాస్పిటల్ ఎమర్జెన్సీ గా వెళ్లాలంటే చర్ల నుండి భద్రాచలం వరకు మూడు గంటల ప్రయాణం పడుతుందని అందువల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన తెలిపారు.

ఇసుక ర్యాంపుల వల్ల అనేకమంది ప్రజలు యాక్సిడెంట్ అయి పిట్టల రాలిపోతున్న రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడిన చందంగా వ్యవహరిస్తుందని ఆయన తెలిపారు. ఒక క్రమ పద్ధతింగా ఇసుక రాంపులను నడపకుండా విచ్చలవిడిగా ఆర్థిక బలంతో రాజకీయ బలంతో కొంతమంది వ్యక్తులు నడుపుతున్నారని ఆయన గుర్తు చేశారు. చట్టాల్ని పట్టించుకోకుండా వివరిస్తున్న వారిని గుర్తించి ఇసుకరాంపులను నిలుపుదల చేసి ప్రజల ప్రాణాల్ని కాపాడాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొత్తం ఏజెన్సీ ఏరియా అయినప్పటికీ గిరిజన చట్టాలని 1/70 లాంటి చట్టాలని ప్రతిష్టంగా అమలు చేయకుండా గిరిజనులకు అన్యాయం చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఏజెన్సీ చట్టాల్ని కాపాడుతూ వ్యవహరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే విస్మరించి వ్యవహరిస్తుందని ఆయన అన్నారు. గిరిజన చట్టాన్ని ప్రతిష్టంగా అమలు చేసి నిరుపేదలైన వారికి ఇల్లు లేని వారికి ఇంటి స్థలాన్ని కేటాయించి ఇల్లు కట్టించాలని ఆయన డిమాండ్ చేశారు.

చట్టాలు అమలు చేయకుండా చట్టాల్ని ఉల్లంఘిస్తే ప్రజా ఆగ్రానికి గురికాక తప్పదని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కి గుర్తు చేశారు. భవిష్యత్తులో డిమాండ్ ల పరిష్కారం కోసం ప్రజలంతా ఐక్యంగా పోరాటం నిర్వహించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గ సభ్యులు K కల్పన, R మధుసూదన్ రెడ్డి, పార్టీ డివిజన్ కమిటీ సభ్యులు, దాసరి సాయన్న, PDSU భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మునిగేలా శివ ప్రశాంత్,POW డివిజన్ అధ్యక్షురాలు మునిగెల మహేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem