Sathupalli: సమాజాన్ని శాస్త్రీయ దృక్పథంతో అధ్యయనం చేయాలి: పోటు రంగారావు!

Sathupalli: సత్తుపల్లిలో సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర రాజకీయ శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. సమాజాన్ని శాస్త్రీయ దృక్పథంతో అధ్యయనం చేయాలని పోటు రంగారావు పిలుపునిచ్చారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 11 Oct 2026 7:09 PM IST
Sathupalli
X

Sathupalli: సమాజాన్ని శాస్త్రీయ దృక్పథంతో అధ్యయనం చేయాలి: పోటు రంగారావు!

సత్తుపల్లి: సమాజాన్ని శాస్త్రీయ దృక్పథంతో అధ్యయనం చేసినప్పుడే సమాజంలోని సమస్యలకు పరిష్కారం చూపగలమని సీపీఐ ( ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. సత్తుపల్లిలో మూడు రోజులు పాటు జరిగే రాష్ట్ర రాజకీయ శిక్షణా తరగతుల సందర్భంగా ఆదివారం మాస్ లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గోకినేపల్లి వెంకటేశ్వర రావు జెండా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా పోటు రంగారావు తత్వశాస్త్రం అంశంపై మాట్లాడుతూ సమాజంలోని అసమానతలను రూపుమాపేది మార్క్సిజం మాత్రమేనన్నారు. దోపిడీ పీడనలేని వ్యవస్థ కోసం పోరాడే కమ్యూనిస్టులు సమాజంలోని వైరుధ్యాలను మార్క్సిస్టు దృక్కోణంలో పరిశీలించాలన్నారు. మార్క్సిజం పిడివాదం కాదని అదొక సామాజిక శాస్త్రమని కొనియాడారు.ఆయా దేశాల కాలమాన పరిస్థితులకు మార్క్సిజాన్ని అనువర్తింపజేయాలన్నారు.

కమ్యూనిస్టు కార్యకర్తలు సమాజంలో వస్తున్న సామాజిక ఆర్థిక రాజకీయ మార్పులను ఎప్పటికప్పుడు అర్థం చేసుకోవాలని, దానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందించుకున్నప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయన్నారు. సిద్ధాంతాన్ని ఆచరణతో సరి చూసుకోవాలని మార్సిస్టు మహోపాధ్యాయులు మార్క్స్, ఎంగెల్స్,లెనిన్,స్టాలిన్ ,మావో అభిప్రాయ పడ్డారని పోటు రంగారావు తెలిపారు.కార్యకర్తలు సైద్ధాంతికకంగా అభివృద్ధి చెందడానికి కృషి చేయాలన్నారు.ఙ్ఞానాన్ని పెంచుకోవాలని పిలుపునిచ్చారు.సాయత్రం పార్టీ రాష్ట్ర నాయకురాలు ఎస్ ఎల్ పద్మ సరకు,శ్రమ,అదనపు విలువ అంశంపై బోధించారు.

బీజేపీ కి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు మాస్ లైన్ నాయకుల ధ్వజం

తరగతులను ప్రారంభించిన మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కెచ్చల రంగారెడ్డి,గోకినేపల్లి వెంకటేశ్వర రావు, కె. రమ ,గుమ్మడి నరసయ్య మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం పై నమ్మకం లేదని, రాజ్యాంగ వ్యవస్థలను తన గుప్పెట్లోకి తీసుకొని ఫాసిజం వైపు అడుగులేస్తుందన్నారు. అసంతృప్తితో ఉన్న విద్యార్థులు యువత తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారని అభిప్రాయపడ్డారు.

హిందూ మత సెంటిమెంటుతో దేశ వనరులను కార్పొరేట్ వర్గాలకు కట్టబెడుతుందన్నారు. ఎన్నికల వ్యవస్థను ధ్వంసం చేయడానికి ఓటరు జాబితా సమగ్ర సవరణ పేరుతో 13 కోట్ల మంది ఓట్లను తొలగించిందన్నారు.ఈ తరగతులకు మాస్ లైన్ రాష్ట్ర,ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు సీవై పుల్లయ్య,ముద్దా బిక్షం, ఎస్ కె గౌస్,ఆవుల అశోక్,అమర్లపూడి రాము, కె రవి, జి.లలిత, కె .కల్పన,జి.ప్రభాకర్,గంటా శ్రీనివాసరావు, బీరెల్లి లాజర్, కాటినేని శ్రీనివాసరావు,అమర్లపూడి శరత్,తాటి రాజు, కె.పుల్లారావు,ఒగ్గు నాగిరెడ్డి, కొర్సా వెంకటేష్, జె .మాల్యాద్రి, పరిమళ,కందిమళ్ల నాగ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI