Sathupally: అక్టోబర్ 11 నుండి సత్తుపల్లిలో సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ రాజకీయ తరగతులు

Sathupally: సత్తుపల్లిలో అక్టోబర్ 11 నుంచి 13 వరకు సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర రాజకీయ తరగతులు. విప్లవ ఉద్యమ కార్యకర్తలకు సిద్ధాంత శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడి.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 10 Oct 2026 8:26 PM IST
Sathupally
X

Sathupally: అక్టోబర్ 11 నుండి సత్తుపల్లిలో సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ రాజకీయ తరగతులు

సత్తుపల్లి: సిపిఐ ఎం ఎల్ మాస్ లైన్ రాష్ట్ర రాజకీయ తరగతులు అక్టోబర్ 11,12,13తేదీలలో సత్తుపల్లిలో(బత్తుల వెంకటేశ్వరరావు నగర్ ) మాధురి ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్నామని పార్టీరాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గోకినేపల్లి వెంకటేశ్వరరావు,జిల్లా కార్యదర్శి ఆదివారం సమావేశంలోవారు తెలిపారు.

11 తేదీన ఆదివారం "తత్వశాస్త్రం" అంశాన్ని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, సాయంత్రం "వర్గం- కులం" అంశాన్ని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం కృష్ణ, 12వ తేదీన సోమవారం "జాతీయ అంతర్జాతీయ పరిస్థితులు" అంశాన్ని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు* కే సూర్యం,* సాయంత్రం "సరుకు- శ్రమ -ఆదనపు విలువ" అంశాన్ని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ఎల్ పద్మ, 13వ తేదీ మంగళవారం "పార్టీ కార్యక్రమం" అంశాన్ని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం హన్మేష్, సాయంత్రం "పార్టీ నిర్మాణం- పని విధానం" అంశాన్ని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే రమ బోధిస్తారనీ వారు తెలిపారు.

నేడున్న రాజకీయ, ఆర్థిక,సామాజిక, సాంస్కృతిక పరిస్థితుల నేపథ్యంలో కమ్యూనిస్టు విప్లవో ద్యమంలో పనిచేస్తున్న కార్యకర్తలకు సిద్ధాంత, రాజకీయ అధ్యయనం, ఆచరణ అత్యంత అవసరమని, అందుకోసం కార్యకర్తలకు రాజకీయ శిక్షణ ఇస్తున్నామని వారు తెలిపారు. జిల్లాలో ఉన్న డివిజన్ కమిటీ సభ్యులు హాజరై జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అమర్లపూడి రాము ఖమ్మం జిల్లా నాయకులు గోకిననేపల్లి లలిత, గంట శ్రీనివాసరావు బీరెల్లి లాజర్ అమర్లపూడి శరత్, తదితరులు పాల్గొన్నారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI