Kothagudem: జూలూరుపాడులో అమరవీరుల సంస్మరణ సభ!

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం అన్నారూపాడులో సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపందా ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు.

SK MAHABOOB JANI, JULURPADU
Published on: 1 Nov 2026 1:17 PM IST
Kothagudem
X

Kothagudem: జూలూరుపాడులో అమరవీరుల సంస్మరణ సభ!

Kothagudem: నవంబర్ 1 నుండి 10 వరకు గ్రామ గ్రామాన అమరవీరుల సంస్మరణ సభలు జరపమని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కమిటీ పిలుపు లోభాగంగా ఈరోజ జూలూరుపాడు మండలం అన్నారు పాడుగ్రామంలో సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ప్రజా పందా అన్నారు పాడు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ సభ జరిగింది.

ఈ సభకు ధనమంతరావు మండల నాయకులు అధ్యక్షత వహించగా సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ జిల్లా నాయకులు బానోతు ధర్మ.మాట్లాడుతూ దేశంలోనే పీడిత ప్రజల కోసం తినటానికి తిండి కావాలని ఉండటానికి ఇల్లు కావాలని కట్టుకోవటానికి బట్ట కావాలని పేద ప్రజల కోసం దోపిడీ రహిత సమాజాన్ని నిర్మించాలని లక్ష్యంతొ తమ అమూల్యమైన లక్ష్యాలనువిడిచి పేద ప్రజల కోసం పోరాడి అసువులు బాసిన ఎంతోమంది అమరవీరులను స్మరించుకొని నివాళి అర్పించారని అమరవీరులు చూపిన బాటలో మనమందరం పయనించాలని వారి ఆశయ సాధన కోసం ఎర్రజెండాను మన భుజాస్కందాలపై ఉన్నదని అమరవీరులు సాధించి పెట్టిన హక్కులను కాపాడుకో కొనుటకు సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంద నిర్వహిస్తున్న రాజీలేని పోరాటంలో అశేష ప్రజానీకం మమేకం కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలొ మండల నాయకులు తోటకూరి నరేష్ ధనవంతురావు. గూగులొత్.ల్లింగ.గ్రామ శాఖ కార్యదర్శి భానోతుఈరు గ్రామ కార్యకర్తలుదశరథ్ బాబు కైలా సర్దార్ కృష్ణ సురేష్ నరసింహ సోమల. వెంకట్రావు.సేవ. కాంతి. అనూష తదితరులు పాల్గొన్నారు.

SK MAHABOOB JANI, JULURPADU

SK MAHABOOB JANI, JULURPADU