Manuguru: సింగరేణిని హెచ్చరించిన ఆర్. మధుసూదన్ రెడ్డి

Manuguru: మణుగూరు రోడ్డుపై విపరీతమైన బొగ్గు దుమ్ముతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని, సింగరేణి యాజమాన్యం తక్షణమే దుమ్ము నివారణ చర్యలు.

A CHANDRA SHEKAR, PINAPAKA
Published on: 10 Oct 2026 8:51 PM IST
Manuguru
X

Manuguru: సింగరేణిని హెచ్చరించిన ఆర్. మధుసూదన్ రెడ్డి

మణుగూరు: సింగరేణి యాజమాన్యం ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడొద్దని, దుమ్ము నివారణ చర్యలు చేపట్టాలని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజా పంథా) మణుగూరు డివిజన్ కార్యదర్శి ఆర్. మధుసూదన్ రెడ్డి సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మణుగూరు _ ఏటూరు నాగారం ప్రధాన రహదారిలోని రైల్వే బ్రిడ్జి దగ్గర కనకదుర్గమ్మ గుడి దగ్గర నుండి మల్లెపల్లి ఓసి కి పోయే మూలమలుపు వరకు లారీలు, బస్సులు ఇతర వాహనాల రాకపోకల సందర్భంగా విపరీతమైన బొగ్గు దుమ్ము లేస్తూ ఆ రహదారి గుండా ప్రజలు ప్రయాణించలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు.

ఆ దుమ్ము పీల్చడం వలన ప్రజలు ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యాధులు తదితర రోగాల బారిన పడే ప్రమాదం ఉందన్నారు. సింగరేణి యాజమాన్యం ఈ సమస్యపై దృష్టి పెట్టి, రోడ్డుపై దుమ్ములేకుండా శుభ్రం చేయించి, వాటర్ స్ప్రే చేయించి దుమ్ము నివారణ చర్యలు తీసుకొని ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ఆందోళన తప్పదన్నారు.

A CHANDRA SHEKAR, PINAPAKA

A CHANDRA SHEKAR, PINAPAKA