Khammam: ఆర్టీసీ ఎన్నికల్లో పనిచేసే వారికే కార్మికుల పట్టం బాగం హేమంతరావు
Khammam: ఖమ్మంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కూటమి అభినందన సభ. ప్రలోభాలకు లొంగకుండా పనిచేసే సంఘానికే కార్మికులు పట్టం కట్టారని బాగం హేమంతరావు వెల్లడి.
Khammam: ఆర్టీసీ ఎన్నికల్లో పనిచేసే వారికే కార్మికుల పట్టం బాగం హేమంతరావు
ఖమ్మం: ఆర్టిసి కార్మికులు పని చేసే వారికే పట్టం కట్టారని తమ పక్షాన కష్ట కాలంలో ఎవరు నిలబడ్డారో ఎవరు హక్కుల కోసం పోరాడారో వారికే గుర్తింపు ఎన్నికల్లో ఓటు వేశారని సిపిఐ జాతీయ సమితి -సభ్యులు బాగం హేమంతరావు తెలిపారు. అధికార పార్టీకి తొత్తు సంఘాలు ఎన్ని ప్రలోభాలకు గురి చేసిన కార్మికులు లొంగలేదని ఆయన తెలిపారు. శుక్రవారం జరిగిన ఆర్టిసి గుర్తింపు సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన ఎంప్లాయీస్ యూనియన్ కూటమి అభినందన సభ శనివారం స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు రావి శివరామకృష్ణ అధ్యక్షతన జరిగింది.
ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన హేమంతరావు మాట్లాడుతూ అనేక దశాబ్దాల ఆర్టిసి చరిత్రలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మొదలు ఇప్పటి వరకు అధికార పార్టీ ఏనాడు ఆర్టిసి గుర్తింపు ఎన్నికల్లో జోక్యం చేసుకోలేదన్నారు. ఏకంగా రాష్ట్ర క్యాబినెట్ ఏర్పాటు చేసి కార్మికులను వంచించిన ఒక నాయకున్ని అడ్డుపెట్టుకుని సొంత సంఘాన్ని సైతం పక్కకు నెట్టి కాంగ్రెస్ పార్టీ అడ్డదారిన ఓ తొత్తు సంఘానికి గుర్తింపునిచ్చేందుకు ప్రయత్నించిందన్నారు. మంత్రులు, ఎంఎల్ఎలు, పిసిసి అధ్యక్షుడు సైతం ప్రచారంలో పాల్గొన్న కార్మికులు మాత్రం పనిచేసే సంఘానికి గుర్తింపు నిచ్చారన్నారు.
50 శాతానికి పైగా ఓట్లు తెచ్చుకుని ఆర్టిసి ఎంప్లాయీస్ యూనియన్ కూటమి విజయ ఢంకా మోగించిందని ఈ -విజయం యూనియన్ బాధ్యతను మరింత పెంచిందని హేమంతరావు తెలిపారు. ప్రతి రీజియన్కు కోట్ల రూపాయలను వెదజల్లారని ప్రలోభం తారాస్థాయికి చేరిన కార్మికులు నిష్పక్షపాతంగా ఓటు వేశారని ఆయన తెలిపారు. ప్రధానంగా ఆర్టిసిని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను సజావుగా కార్మికులకు అన్యాయం జరగని రీతిలో విలీనం జరగాలని హేమంతరావు సూచించారు. కార్మికులకు అండగా సిపిఐ, ఏఐటియుసి పనిచేస్తాయని -ఆయన తెలిపారు.
సభ అనంతరం సిపిఐ, ఏఐటియుసి నాయకులు ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, సహయ కార్యదర్శి జమ్ముల జితేందర్రెడ్డి, -ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి పాటి అప్పారావు, రీజియన్ అధ్యక్ష, కార్యదర్శులు -బిఎస్ రెడ్డి, పిల్లి రమేష్, సిపిఐ, ఏఐటియుసి, ఎంప్లాయీస్ యూనియన్ కూటమి నాయకులు మహ్మద్ సలాం, -శింగు నర్సింహారావు, తోట రామాంజనేయులు, అనిత, గాదె లక్ష్మి నారాయణ, ఎల్ఆర్కేరావు, బుచ్చిబాబు,




