Yellandu: నిరుద్యోగుల కన్నీళ్లకు పరిష్కారం చూపడానికే ఎమ్మెల్సీగా పోటీ: కృష్ణ గౌడ్!

Yellandu: నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి ఉమ్మడి నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు డాక్టర్ నల్ల మాస కృష్ణ గౌడ్ తెలిపారు.

SHOBAN BABU, YELLANDU
Published on: 23 Nov 2026 6:31 PM IST
Yellandu
X

Yellandu: నిరుద్యోగుల కన్నీళ్లకు పరిష్కారం చూపడానికే ఎమ్మెల్సీగా పోటీ: కృష్ణ గౌడ్!

ఇల్లందు: నిరుద్యోగుల కన్నీళ్లకు పరిష్కారం చూపడానికి,ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు న్యాయం చేయడానికి,నేటి విద్యావ్యవస్థలోని లోపాలను ప్రశ్నించడానికి చట్టసభలో బలంగా గళమెత్తడానికి, ఉమ్మడి నల్గొండ -ఖమ్మం -వరంగల్ ఎమ్మెల్సీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు హైకోర్టు అడ్వకేట్ డాక్టర్ నల్ల మాస కృష్ణ గౌడ్ తెలిపారు.

సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొమరం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీలకతీతంగా, రాజకీయాలకతీతంగా, బడుగు బలహీన వర్గాల తరుపున మీ గొంతుకగా, మీ హక్కుల కోసం పోరాడే నాయకుడిగా చట్టసభల్లో నాకు అవకాశం కల్పించాలని కోరారు.

గతంలో గెలిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీలు పట్టాభద్రుల సమస్యలను ఏ రోజు చట్టసభల్లో మాట్లాడలేదని, పట్టభద్రులంతా విజ్ఞతతో ఆలోచించి సరైన అభ్యర్థి నైనా తనకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

SHOBAN BABU, YELLANDU

SHOBAN BABU, YELLANDU