Manuguru: సమితి సింగారంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు!

Manuguru: మణుగూరు మండలం సమితి సింగారం గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో సర్పంచ్ కలబోయిన మాధవరావు పాల్గొన్నారు.

A CHANDRA SHEKAR, PINAPAKA
Published on: 26 Nov 2026 5:30 PM IST
Manuguru
X

Manuguru: సమితి సింగారంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు!

మణుగూరు: మణుగూరు మండలం,సమితి సింగారం గ్రామపంచాయతీ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలో పాల్గొని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా వారిని స్మరించుకొని అనంతరం భారత రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞ చేసిన.

సమితి సింగారం గ్రామపంచాయతీ సర్పంచ్ కలబోయిన మాధవరావు, ఉప సర్పంచ్ గాండ్ల సురేష్, వార్డు సభ్యులు మాదాడి రాజేష్, వేర్పుల నరేష్ గార్లు.

ఈ సందర్భంగా సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ గార్లు మాట్లాడుతు భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ 1949 నవంబర్ 26న ఆమోదం తెలిపిందని,భారత రాజ్యాంగం భారతదేశ ప్రజాస్వామ్యానికి పునాది,భారత దేశ పౌరులకు రాజ్యాంగం ద్వారా ప్రాథమిక హక్కులు,విధులు కల్పించడంతోపాటు, సామాజిక న్యాయం లౌకికవాదం, ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేయడానికి భారత పౌరుడికి ఓటు హక్కును కల్పించడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జక్కుల అశోక్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ గణేష్ రెడ్డి మరియు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

A CHANDRA SHEKAR, PINAPAKA

A CHANDRA SHEKAR, PINAPAKA