Kothagudem: ప్రజాస్వామ్య పరిరక్షణ మహా ధర్నా విజయవంతం - నూకల రంగారావు కృతజ్ఞతలు!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన కాంగ్రెస్ మహా ధర్నా విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేసిన పాల్వంచ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల రంగారావు.
Kothagudem: ప్రజాస్వామ్య పరిరక్షణ మహా ధర్నా విజయవంతం - నూకల రంగారావు కృతజ్ఞతలు!
Kothagudem: ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు సంరక్షణ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం నిర్వహించిన మహా ధర్నాను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పాల్వంచ టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్య క్షులు నూకల రంగారావు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
భారత ఎన్నికల సంఘం పనితీరు, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలకు నిరసనగా నిర్వహించిన ఈ మహా ధర్నాకు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, ఇన్చార్జిలు, పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ సంఘీభావాన్ని ప్రకటించడం అభినందనీయ మన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడటం, ప్రతి పౌరుడి ఓటు హక్కుకు రక్షణ కల్పించడం లక్ష్యంగా చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పాల్గొని తమ బాధ్యతను చాటుకున్నా రని పేర్కొన్నారు.
పార్టీ పిలుపునకు స్పందించి దూర ప్రాంతాల నుంచి సైతం తరలివచ్చి ధర్నాను విజయ వంతం చేసిన ప్రతి ఒక్కరి సహకారం మరువలేనిదన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టే పోరాటాల్లో ఇదే ఐక్యత, స్ఫూర్తి కొనసాగించాలని నూకల రంగారావు పిలుపునిచ్చారు. మహా ధర్నా విజయవంతానికి కృషి చేసిన జిల్లా, నియోజకవర్గ, మండల, పట్టణ స్థాయి నాయకులు, కార్య కర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు,అందరికి పాల్వం చ టౌన్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.




