Manuguru: మణుగూరులో ఎస్‌ఐఆర్ రద్దు చేయాలంటూ కాంగ్రెస్ నిరసన!
Manuguru: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఎస్‌ఐఆర్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకుల భారీ నిరసన ర్యాలీ.
Manuguru: మణుగూరులో ఎస్‌ఐఆర్ రద్దు చేయాలంటూ కాంగ్రెస్ నిరసన!
Manuguru: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల వ్యవస్థను ప్రభావితం చేస్తోందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన ‘SIR’ కార్యక్రమాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీలో నిరసన చేపట్టిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఇండియా కూటమి ఎంపీల అరెస్టులను ఖండించారు. ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు.
మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు పినపాక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ గా వెళ్లి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు.
ఎన్నికల వ్యవస్థపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభావం చూపుతోందని ఆరోపించారు. ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఓటర్ల జాబితా సవరణలో భాగంగా చేపడుతున్న ‘SIR’ కార్యక్రమాన్ని వెంటనే నిలిపివేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. SIR కొనసాగితే అర్హులైన ఓటర్లకు ఇబ్బందులు ఏర్పడి, కొంతమంది తమ ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇక ఢిల్లీలో ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన చేపట్టిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఇండియా కూటమి ఎంపీల అరెస్టులను తీవ్రంగా ఖండించారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులపై చర్యలు తీసుకోవడం సరికాదని అన్నారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో నమ్మకం ఉండేలా ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు.
ఎన్నికల వ్యవస్థపై తలెత్తుతున్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపైనే ఉందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీఈఓ జ్ఞానేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని, పినపాక MLA పాయం డిమాండ్ చేశారు.
దేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ఓటు హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య రక్షణ.. ప్రజల ఓటు హక్కు కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.




