Palwancha: పాల్వంచలో ఇందిరమ్మ జీవిత బీమా నమోదు పరిశీలించిన నేతలు!
Palwancha: కొత్తగూడెం కార్పొరేషన్ పరిధి పాల్వంచ 2వ, 8వ డివిజన్లలో ఇందిరమ్మ జీవిత బీమా నమోదు ప్రక్రియను శుక్రవారం కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు.
Palwancha: పాల్వంచలో ఇందిరమ్మ జీవిత బీమా నమోదు పరిశీలించిన నేతలు!
పాల్వంచ: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ పట్టణం 2వ, 8వ డివిజన్లలో కొనసాగుతున్న ఇందిరమ్మ జీవిత భీమా నమోదు ప్రక్రియను టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల రంగారావు, డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత కుమారి, కార్పొరేటర్ భవిత కిరణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా నమోదు ప్రక్రియ తీరును, ప్రజలకు అందుతున్న సేవలను వారు ప్రత్యక్షంగా పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.
ఇందిరమ్మ జీవిత భీమా నమోదు కోసం ఆయా డివిజన్లకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ విజయానంద్, మేనేజర్ సత్యనారాయణ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.




