Sathupally: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విజయంపై కాంగ్రెస్ నేతల సమాలోచనలు!

Sathupally: ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గెలుపుకోసం సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయితో నేతలు సమాలోచనలు జరిపారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 28 Oct 2026 8:46 AM IST
Sathupally
X

Sathupally: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విజయంపై కాంగ్రెస్ నేతల సమాలోచనలు!

Sathupally: ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాం రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి విజయానికి పార్టీ నాయకులు సమన్వయంతో కృషి చేయాలని చర్చించారు. ఈ క్రమంలో నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి తన బృందంతో కలిసి మంగళవారం ఉదయం సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్‌ను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై ఎమ్మెల్యేతో చర్చించారు. సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో ఎన్నికల నిర్వహణ, పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం, ఎన్నికల నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై అభిప్రాయాలను పంచుకున్నారు.

పట్టభద్రుల ఓటర్లను సంప్రదించడం, ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాలను సమన్వయంతో నిర్వహించడం వంటి అంశాలపై పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చ జరిగినట్లు సమాచారం.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాం రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ పార్టీ నాయకులు తమ కార్యాచరణను కొనసాగిస్తున్నారు. ఈ సమావేశం ఎన్నికల సన్నద్ధతలో భాగంగా జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గాదె చెన్నకేశవరావు కమల్ పాషా దేవి శ్రీనివాసరావు నాగభూషణం బత్తుల భరత్ మల్లూరు దిలీప్ మట్ట చెన్నారావు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI