Khammam: డిజిటల్ గవర్నెన్స్‌పై జిల్లా స్థాయిలో సమగ్ర శిక్షణ: డీఆర్వో రామ్మూర్తి!
Khammam: ఖమ్మం కలెక్టరేట్లో E-HRMS, E-Sanctions, WAMIS మాడ్యూల్స్‌పై 650 మంది డీడీఓలకు డీఆర్వో రామ్మూర్తి సమగ్ర శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Khammam: డిజిటల్ గవర్నెన్స్‌పై జిల్లా స్థాయిలో సమగ్ర శిక్షణ: డీఆర్వో రామ్మూర్తి!
ఖమ్మం: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ గవర్నెన్స్ కార్యక్రమంలో భాగంగా, జిల్లా స్థాయిలో అధికారుల పాలనా సామర్థ్యాన్ని పెంచేందుకు E-HRMS, E-Sanctions, WAMIS మాడ్యూల్స్‌పై కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా రెవెన్యూ అధికారి రామ్మూర్తి హాజరై ప్రారంభించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు, ఆర్థిక శాఖ ద్వారా రాష్ట్ర స్థాయిలో సెక్రటరీలు, శాఖాధిపతులకు పూర్తయిన శిక్షణకు కొనసాగింపుగా ఈ క్యాస్కేడింగ్ శిక్షణను జిల్లాలోని డిడిఓలు, అధికారులకు అందించారు. జిల్లా ఖజానా కార్యాలయ డిప్యూటీ డైరెక్టర్ వై. శ్రీనివాస్ రెడ్డి, డిస్ట్రిక్ట్ పీఏఓ కె. రామ్ లు డీడీఓ లకు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణకు దాదాపు 650 మంది అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి రామ్మూర్తి మాట్లాడుతూ...
ఉద్యోగి నియామకం మొదలుకొని పదవీ విరమణ వరకు అపాయింట్మెంట్, ప్రమోషన్, లీవ్స్, బదిలీలు వంటి అన్ని రకాల సర్వీస్ వివరాలు ఇకపై పూర్తి స్థాయిలో ఆన్లైన్లోనే జరుగుతాయన్నారు. ప్రభుత్వ వ్యయాలకు సంబంధించిన అనుమతులు, బిల్లుల మంజూరు అంతా డిజిటల్ విధానంలో పారదర్శకంగా సాగుతుందని తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి పనుల అంచనాలు, సాంకేతిక మంజూరు, కాంట్రాక్ట్ ఒప్పందాలు, పని పూర్తయ్యే ప్రక్రియ వరకు అంతా ఆన్లైన్లో పర్యవేక్షించబడుతుందని తెలిపారు.
శిక్షణలో ఇచ్చిన మూడు డిజిటల్ మాడ్యూల్స్ అమలుతో ప్రభుత్వ పాలనలో పారదర్శకత పెరుగుతుందని, ఫైళ్ల జాప్యం తగ్గి ఉద్యోగులకు, ప్రజలకు వేగవంతమైన సేవలు అందుతాయని జిల్లా రెవెన్యూ అధికారి తెలిపారు. జిల్లాలోని అన్ని కార్యాలయాల అధికారులు ఈ డిజిటల్ విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వైరా ఏటీఓ ప్రసన్నకుమార్, ఎస్టివోలు మోదుగు వేలాద్రి, నాగేంద్ర కుమారి, మధిర వెంకటేశ్వర్లు, సునీల్, విజయ సారధి, పీఏఓ సూపరింటెండెంట్ రాధికా రెడ్డిలతో పాటు జిల్లా ఖజానా కార్యాలయ సిబ్బంది, వివిధ సబ్ ట్రెజరీల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి, ఖమ్మం కార్యాలయంచే జారీచేయనైనది.




