Palwancha: పాల్వంచ కేటీపీఎస్ ఏ కాలనీ ఆలయంలో భగవద్గీత 700 శ్లోకాల పారాయణం!

Palwancha: పాల్వంచ కేటీపీఎస్ ఏ కాలనీ ఆలయంలో జగద్గురు సమాజ మండలి ఆధ్వర్యంలో ఆదివారం భగవద్గీత 700 శ్లోకాల పారాయణం జరిగింది. కార్పొరేటర్ భాగ్యలక్ష్మి అభినందించారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 29 Nov 2026 9:03 PM IST
Palwancha
X

Palwancha: పాల్వంచ కేటీపీఎస్ ఏ కాలనీ ఆలయంలో భగవద్గీత 700 శ్లోకాల పారాయణం!

పాల్వంచ టౌన్: పాల్వంచ కేటీపీఎస్‌ ఏ కాలనీలోని శ్రీ రుక్మిణి రాధాకృష్ణ దేవాలయంలో ఆదివారం జగద్గురు సమాజ మండలి ఆధ్వర్యంలో కల్లగుంట జయలక్ష్మి నేతృత్వంలో భగవద్గీతలోని 700 శ్లోకాల పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా నాలుగో డివిజన్‌ కార్పొరేటర్‌ చెరుకు భాగ్యలక్ష్మి పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించిన జయలక్ష్మి బృందాన్ని అభినందించారు.

తక్కువ వ్యవధిలోనే 13వసారి భగవద్గీత పారాయణం నిర్వహించడం విశేషమని ఆమె కొనియాడారు. సనాతన ధర్మ పరిరక్షణతో పాటు ఆధ్యాత్మిక విలువల వ్యాప్తికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాల్లో పారాయణ కార్యక్రమాలు నిర్వహించాలని, భగవద్గీత బోధనలో విద్యార్థులను కూడా భాగస్వాములను చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డీఈ రవి, ఏడీ రమేష్, శ్రీనివాస్, బీవీఆర్ గురుస్వామి, హరి రమేష్ గురుస్వామి, కందుకూరి శ్రీను స్వామి, డిల్లు స్వామి, ఆలయ అర్చకులు ప్రవీణ్, చెరుకు అశోక్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN