Khammam: కారుణ్య నియామకం కింద గుంజులూరి రేణుకకు నియామక ఉత్తర్వులు అందజేత!
Khammam: ఖమ్మం నగరపాలక సంస్థలో విధి నిర్వహణలో మరణించిన గుంజులూరి బాబు కుమార్తె రేణుకకు కమిషనర్ అభిషేక్ అగస్త్య కారుణ్య నియామక ఉత్తర్వులు అందజేశారు.
Khammam: కారుణ్య నియామకం కింద గుంజులూరి రేణుకకు నియామక ఉత్తర్వులు అందజేత!
ఖమ్మం: ఖమ్మం నగరపాలక సంస్థలో విధులు నిర్వహిస్తు మరణించిన గుంజులూరి బాబు కుటుంబానికి అండగా నిలుస్తూ, ఆయన కుమార్తె గుంజులూరి రేణుకకు కారుణ్య నియామకం కింద పబ్లిక్ హెల్త్ వర్కర్‌గా ఉద్యోగ అవకాశం కల్పించారు.
ఈ మేరకు ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ శ్రీ అభిషేక్ అగస్త్య IAS గారు రేణుకకు నియామక ఉత్తర్వులను స్వయంగా అందజేశారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం కారుణ్య నియామకం కింద ఈ నియామకాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందుకున్న రేణుకకు విధుల్లో చేరేందుకు 15 రోజుల గడువు కల్పించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ, విధి నిర్వహణలో ఉండగా ఉద్యోగిని కోల్పోయిన కుటుంబానికి ప్రభుత్వం తరఫున అండగా నిలుస్తూ, కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించడం ద్వారా భరోసా కల్పిస్తున్నట్లు తెలిపారు.




