Kothagudem: మతాలు వేరైనా.. మనుషులం ఒక్కటే: కాసుల వెంకట్

Kothagudem: కొత్తగూడెం కూలీలైన్ మసీదులో మతసామరస్యం, ఐక్యతను చాటుతూ నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత కాసుల వెంకట్, ఏఎంసీ చైర్మన్ లాల్ సింగ్ పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 1 Nov 2026 3:38 PM IST
Kothagudem
X

Kothagudem: మతాలు వేరైనా.. మనుషులం ఒక్కటే: కాసుల వెంకట్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కొత్తగూడెంలోని కూలీలైన్ మసీదులో మతసామరస్యం, ఐక్యత, శాంతి, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మనుషులంతా ఒక్కటే.. అందరం కలిసుంటేనే సమాజంలో అభివృద్ధి సాధ్యం అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు పరస్పర సోదరభావం, మానవత్వం, శాంతియుత వాతావరణం ప్రాముఖ్యతను వివరించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాసుల వెంకట్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లాల్ సింగ్ మాట్లాడుతూ.. ఇస్లాం, ముస్లిం సోదరుల పట్ల సమాజంలో ఉన్న అపోహలను తొలగిస్తూ, మానవాళి అంతా ఒక్కటేనని, కులమతాలకు అతీతంగా ఐకమత్యంతో జీవిస్తూ సమాజ శ్రేయస్సు, అభివృద్ధికి కృషి చేయాలనే గొప్ప సందేశాన్ని అందించిన కూలీలైన్ మసీదు పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ పరస్పర గౌరవం, సోదరభావంతో మెలుగుతూ శాంతి సామరస్యాల పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కాసుల సాయి చరణ్, ఇమ్రాన్, ఫయాజ్, షాకీర్, మౌలానా సాబ్, అబుల్ ఖాన్, జావేద్ తదితరులు పాల్గొన్నారు. మతాలు వేరైనా.. మనుషులం ఒక్కటే.. ఐకమత్యమే సమాజ అభివృద్ధికి పునాది అనే సందేశాన్ని ఈ కార్యక్రమం చాటిచెప్పింది.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM