Kothagudem: ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు!

Kothagudem: కొత్తగూడెం ఐడీఓసీ కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 31 Oct 2026 2:04 PM IST
Kothagudem
X

Kothagudem: ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు!

Kothagudem: జాతి ఐక్యతకు బలమైన పునాదులు వేసిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని జిల్లా కలెక్టర్ అంకిత్ కొనియాడారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా శనివారం కొత్తగూడెంలోని ఐడీఓసీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ అంకిత్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, డీఆర్ఓ పద్మావతితో కలిసి పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అధికారులు, సిబ్బందితో జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం అనంతరం సుమారు 500 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడం పెద్ద సవాలుగా మారిందన్నారు. భారత తొలి ఉప ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ తన దృఢ సంకల్పం, కార్యదక్షతతో సంస్థానాల విలీనాన్ని విజయవంతం చేసి జాతీయ సమైక్యతకు బలమైన పునాదులు వేశారని పేర్కొన్నారు.

పటేల్ చూపిన ఐక్యతా మార్గంలో దేశం ముందుకు సాగుతోందని, జాతీయ నాయకుల త్యాగాలు, పోరాటాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సూచించారు. కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ఐక్యత, సమగ్రత, సోదరభావంతో మెలుగుతూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీపీఓ సునీత, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, డీపీఓ అనూష, బీసీ సంక్షేమ అధికారి విజయలక్ష్మి, ఓఎస్డీ వెంకటరమణతో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM