Mulakalapalli: కలెక్టర్ అంకిత్ మూకమామిడి ఏకలవ్య పాఠశాల ఆకస్మిక తనిఖీ!
Mulakalapalli: ములకలపల్లి మండలం మూకమామిడి ఏకలవ్య పాఠశాలను కలెక్టర్ అంకిత్ ఆకస్మిక తనిఖీ. పరీక్షల నిర్వహణ, మెస్, కిచెన్ షెడ్ పరిశీలించి నాణ్యమైన వసతులకు ఆదేశం.
Mulakalapalli: కలెక్టర్ అంకిత్ మూకమామిడి ఏకలవ్య పాఠశాల ఆకస్మిక తనిఖీ!
Mulakalapalli: ములకలపల్లి మండలం మూకమామిడి ఏకలవ్య పాఠశాలను జిల్లా కలెక్టర్ అంకిత్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహిస్తున్న పరీక్షలను పరిశీలించిన కలెక్టర్, ప పాఠశాలలోని ప్రతి తరగతి గదిని సందర్శించిన కలెక్టర్, అక్కడ జరుగుతున్న పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. విద్యార్థులు రాస్తున్న పరీక్షలను గమనించి, వారి ప్రశ్నపత్రాలు, ఆన్సర్ షీట్లను పరిశీలించారు.
పరీక్షల నిర్వహణలో పాటిస్తున్న విధానం, విద్యార్థుల హాజరు, పరీక్షల సమయంలో తీసుకుంటున్న చర్యలను పరిశీలించి, ప్రధానోపాధ్యాయులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ రీజియన్ పరిధిలోని ఏకలవ్య పాఠశాలలకు ఒకే ప్రశ్నపత్రాన్ని రూపొందించి పంపిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయులు కలెక్టర్‌కు వివరించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు.
అనంతరం పాఠశాలలో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను కలెక్టర్ పరిశీలించారు. మెడికల్ రూమ్‌లో అందుబాటులో ఉన్న మందులు, విద్యార్థులకు అందించిన చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అవసరమైన మందులు, ప్రాథమిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పాఠశాల కిచెన్ షెడ్‌ను పరిశీలించిన కలెక్టర్, మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందిస్తున్నారా లేదా అని తనిఖీ చేశారు. వంటకు వినియోగిస్తున్న కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. కూరగాయలను నేలపై ఉంచడాన్ని గమనించిన కలెక్టర్, కూరగాయలను నేలపై ఉంచడం వల్ల పురుగులు, క్రిమికీటకాలు చేరి ఆహారం కలుషితమయ్యే అవకాశం ఉందని తెలిపారు. కూరగాయలను ర్యాకులు, బండలపై సురక్షితంగా నిల్వ చేయాలని ఆదేశించారు.
కిచెన్ నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించిన కలెక్టర్, ఆహార పదార్థాల తయారీలో తప్పనిసరిగా పరిశుభ్రత ప్రమాణాలను పాటించాలని సూచించారు. వంటకు వినియోగించే కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలను శుభ్రంగా కడిగి, నాణ్యతను పరిశీలించిన అనంతరం మాత్రమే వినియోగించాలని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన, తాజా కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలను మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు. వంటశాలను ప్రతిరోజూ శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవడంతో పాటు, వంట సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రతను పాటించేలా చూడాలని సూచించారు.
స్టోర్ రూమ్‌ను పరిశీలించిన కలెక్టర్, ఆహార పదార్థాలు, ఇతర సామగ్రిని క్రమబద్ధంగా నిల్వ చేయాలని ఆదేశించారు. ధాన్యాలు, పప్పులు, కూరగాయలు తదితర వస్తువులను నేలపై ఉంచకుండా ర్యాకులు, బండలపై భద్రపరచాలని, అవసరమైన ఆహార పదార్థాలను మూత ఉన్న డబ్బాలు, కంటైనర్లలో నిల్వ చేయాలని సూచించారు. వంటశాల, స్టోర్ రూమ్‌తో పాటు పాఠశాల పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.
ఈ రోజు మెనూలో భాగంగా విద్యార్థులకు తయారు చేస్తున్న చికెన్ కూర నాణ్యతను కూడా కలెక్టర్ పరిశీలించారు. చికెన్ ఎంత పరిమాణంలో వినియోగిస్తున్నారని, ఒక్కో విద్యార్థికి ఎంత పరిమాణంలో అందిస్తున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొత్తం 80 కిలోల చికెన్‌ను వంటకు వినియోగిస్తున్నామని, ఒక్కో విద్యార్థికి సుమారు 120 గ్రాముల చొప్పున అందిస్తున్నామని సిబ్బంది కలెక్టర్‌కు తెలిపారు. వంట అనంతరం భోజన నాణ్యతను పరిశీలించి, విద్యార్థులకు సమయానికి, నాణ్యమైన ఆహారం అందేలా చూడాలని కలెక్టర్ సూచించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు, ఆరోగ్యకరమైన ఆహారం, అవసరమైన వైద్య సదుపాయాలు అందేలా పాఠశాల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా చూడాలని, పాఠశాల పరిసరాలు, కిచెన్, స్టోర్ రూమ్‌లను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.




