Bayyaram: బయ్యారంలో బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ!

Bayyaram: బయ్యారం మండలంలో అనారోగ్యంతో బాధపడుతున్న బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మండల కాంగ్రెస్ అధ్యక్షులు జూలకంటి సీతారాం రెడ్డి అందజేశారు.

NARASIMHARAO, BAYYARAM
Published on: 21 Nov 2026 7:10 AM IST
Bayyaram
X

Bayyaram: బయ్యారంలో బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ!

Bayyaram: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని వివిధ గ్రామాలలో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధిత కుటుంబాలకు తెలంగాణ ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తోంది.

ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన చెక్కులను బయ్యారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జూలకంటి సీతారాం రెడ్డి బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోడిపుంజుల తండా గ్రామానికి చెందిన వెర్జ్యా నాయక్ కు మంజూరైన రూ. 59,000/- ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును, రామచంద్రపురం గ్రామపంచాయతీ పరిధిలోని ఆర్.సి.పురం గ్రామానికి చెందిన స్వామి మంజూరైన రూ. 44,000/- ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశామని అన్నారు.

పేద, మధ్యతరగతి ప్రజలు అనారోగ్యం బారిన పడితే ఆర్థికంగా కుంగిపోకూడదనే ఉద్దేశంతోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆదుకుంటుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో పనిచేస్తుందని అన్నారు. బాధిత కుటుంబాలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

NARASIMHARAO, BAYYARAM

NARASIMHARAO, BAYYARAM