Mulakalapalli: ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కృషితో సీఎంఆర్‌ఎఫ్ చెక్కు పంపిణీ!

Mulakalapalli: అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కృషితో మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కును ములకలపల్లి మండలంలో బాధితుడికి అందజేశారు. ఇందిరమ్మ బీమాపై అవగాహన కల్పించారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 23 Nov 2026 2:18 PM IST
Mulakalapalli
X

Mulakalapalli: ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కృషితో సీఎంఆర్‌ఎఫ్ చెక్కు పంపిణీ!

Mulakalapalli: అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కృషితో ముఖ్యమంత్రి సహాయక నిధి (సీఎంఆర్‌ఎఫ్) నుంచి మంజూరైన చెక్కును మొగరాలగుప్ప గ్రామానికి చెందిన కోండ్రు పోతురాజుకు అందజేశారు. మూకమామిడి గ్రామపంచాయతీ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆనంతుల సత్యనారాయణ చేతుల మీదుగా చెక్కును పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం గురించి గ్రామ ప్రజలకు వివరించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా ద్వారా ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం లక్ష్యమని తెలిపారు. కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడంలో ఈ పథకం దోహదపడుతుందని, అర్హులైన వారు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు తాటి వీరభద్రం, కార్యదర్శి కోండ్రు ప్రసాద్, సేవాదళ్ నాయకుడు వట్టం శీను, మండల నాయకుడు తమ్మిశెట్టి శ్రీను, బీఎల్ఏ కాకా బాబురావు, కాకా రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN