Kothagudem: కొత్తగూడెంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
Kothagudem: కొత్తగూడెంలోని డీసీసీ కార్యాలయం, జ్యోతి వృద్ధాశ్రమంలో డీసీసీ అధ్యక్షురాలు తోటా దేవి ప్రసన్న ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
Kothagudem: కొత్తగూడెంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షురాలు తోటా దేవి ప్రసన్న అధ్యక్షతన కొత్తగూడెంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో, జ్యోతి వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు తోటా దేవి ప్రసన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధిస్తూ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఆయురారోగ్యాలతో, సంతోషంగా చిరకాలం కొనసాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగ సీతారాములు, డీసీసీ కమిటీ సభ్యులు ప్రసాద్ పెదబాబు, మందా హనుమంతు, కొడుమూరి శ్రీనివాసరావు, జానీ భాషా, బట్టు మురళి, పైడా రాజేంద్రప్రసాద్, బాలు నాయక్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చీకటి కార్తీక్, పాల సత్యనారాయణరెడ్డి, కొత్వాల శ్రీనివాసరావు, మండే వీర హనుమంతు, మండల కమిటీ నాయకులు పరమేష్ యాదవ్, ప్రసాద్, నూకల రంగారావు, భువన సుందర్ రెడ్డి, అజయ్ కుమార్, జేమ్స్ సునీల్, ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ గద్దెల రమేష్, ఐఎన్టీయూసీ నాయకుడు రజాక్ తదితరులు పాల్గొన్నారు. అలాగే కార్పొరేటర్లు, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.




