Manuguru: ఆర్టీసీ పరిరక్షణకు ఐక్య కూటమిని గెలిపించాలి..అన్నవరపు కనకయ్య!

Manuguru: మణుగూరు ఆర్టీసీ డిపో వద్ద గేటు మీటింగ్. బాణం, నక్షత్రం గుర్తుకు ఓటేసి ఐక్య కూటమిని గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య పిలుపు.

A CHANDRA SHEKAR, PINAPAKA
Published on: 7 Oct 2026 4:10 PM IST
Manuguru
X

Manuguru: ఆర్టీసీ పరిరక్షణకు ఐక్య కూటమిని గెలిపించాలి..అన్నవరపు కనకయ్య!

Manuguru: ఆర్టీసీ కార్మికుల హక్కుల సాధన తో పాటు సంస్థ పరిరక్షణ కోసం నక్షత్రం, బాణం గుర్తుకు ఓటు వేసి ఐక్య కూటమిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య పిలుపునిచ్చారు బుధవారం మణుగూరు డిపో ముందు జరిగిన గేటు మీటింగ్ లో పాల్గొని మాట్లాడుతూ సుదీర్ఘ విరామం తర్వాత ఈ నెల 9న జరగనున్న ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలలో టీఎంయూ, అశ్వద్ధామ రెడ్డి బలపర్చిన టిఎండబ్ల్యూఎఫ్, ఎస్ డబ్ల్యూ ఎఫ్, ఐ ఎన్ టి యు సి కలిసి ఐక్య కూటమిగా పోటీ చేస్తున్నాయని అన్నారు సమ్మె సమయంలో ఇచ్చిన హామీ మేరకు జరుగుతున్న ఎన్నికలలో కార్మికుల ఆలోచించి కార్మికుల పక్షాన నిలిచే ఐక్య కూటమికి మద్దతు ఇవ్వాలని కోరారు.

కార్మికుల హక్కుల కోసం న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సుదీర్ఘకాలం పోరాటం నిర్వహించిన చరిత్ర సిఐటియు అనుబంధ ఎస్ డబ్ల్యూ ఎఫ్ కు ఉన్నదన్నారు ఐక్య కూటమిని దెబ్బతీసేందుకు కొన్ని సంఘాలు యాజమాన్యంతో కుమ్మక్కై అడ్డదారులలో ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు ఆర్టీసీ కార్మికులు సంఘాల చరిత్రను తెలుసుకొని ఓట్లు వేస్తారని పేర్కొన్నారు ఆర్టీసీ సంస్థ పరిరక్షణ కొరకు పోరాడే సంఘాలకు కార్మికులు గెలిపించాలని కోరారు.

కార్మికులపై పనిభారం పెరిగిన కాళీ పోస్టులు భర్తీ చేయకుండా ప్రైవేట్ సంస్థలకు పనులు అప్పగించిన కూటమి పోరాడుతుందని తెలిపారు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం అండగా ఉంటామని పేర్కొంటూ రాష్ట్రంలో బాణం, రీజియన్ లో నక్షత్రం గుర్తుకు ఓటు వేయాలని కోరారు.

సిఐటియు (ఎస్ డబ్ల్యూ ఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షులు బాణాల రాంబాబు, సిఐటియు సీనియర్ నాయకులు నెల్లూరి నాగేశ్వరరావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గద్దల శ్రీనివాస్ రావు, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు సత్ర పల్లి సాంబశివరావు, సర్పంచ్ కుంజా శ్రావణ్, ఎస్ డబ్ల్యూ ఎఫ్ జిల్లా నాయకులు కెవి రామారావు, డిపో అధ్యక్ష కార్యదర్శులు ఆర్ఎన్ రావు, తాటి సుధాకర్ కూటమి నాయకులు కెవి రామారావు, రాముల నాయక్ ,ఎస్ ఎన్ రెడ్డి, సిహెచ్ లింగయ్య ,ఎస్ఆర్ బాబు, అచ్చారావు ,పాల్గొన్నారు.

A CHANDRA SHEKAR, PINAPAKA

A CHANDRA SHEKAR, PINAPAKA