Kothagudem: పండగ నాడు స్వచ్ఛమిత్ర కార్మికులకు పస్తులా?: సీఐటీయూ!

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెంలో స్వచ్ఛమిత్ర కార్మికుల ఆందోళన 6 నెలల పెండింగ్ జీతాలపై కలెక్టర్‌కు వినతి స్పందించి 3 రోజుల్లో 4 నెలల జీతాలు వేస్తామని హామీ ఇచ్చిన డీఈవో.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 28 Sept 2026 10:56 PM IST
Kothagudem
X

Kothagudem: పండగ నాడు స్వచ్ఛమిత్ర కార్మికులకు పస్తులా?: సీఐటీయూ!

కొత్తగూడెం, సెప్టెంబర్ 28, హెచ్ఎంటీవీ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వచ్ఛమిత్ర కార్మికులకు ఆరు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంపై సీఐటీయూ ఆందోళన వ్యక్తం చేసింది. పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ స్వచ్ఛమిత్ర కార్మికుల సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారికి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి భూక్య రమేష్ మాట్లాడుతూ.. చాలీచాలని వేతనాలతో కుటుంబాలను పోషించుకుంటూ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులకు స్వచ్ఛత సేవలు అందిస్తున్న కార్మికులకు ఆరు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. స్వచ్ఛమిత్ర కార్మికులు లేకపోతే పాఠశాలల్లో పారిశుధ్య పనులు నిలిచిపోయే పరిస్థితి ఉంటుందని తెలిపారు.

ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పెండింగ్ వేతనాలను చెల్లించాలని కోరారు. జీతాలు చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి సమ్మెకు దిగుతామని భూక్య రమేష్ హెచ్చరించారు.

స్పందించిన కలెక్టర్. స్వచ్ఛమిత్ర కార్మికుల సమస్యలను విన్నటువంటి కలెక్టర్, డి ఇ ఓ ను పిలిపించి వెంటనే ఈ సమస్య పరిష్కారం చేయాలని , వేతనాలు వేయాలని చెప్పడంతో డిఈఓ స్పందిస్తూ నాలుగు నెలల జీతాలు మూడు రోజుల్లో వేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM