Kothagudem: భద్రాద్రి కొత్తగూడెంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీకృత కలెక్టరేట్లో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాలల సంతోషమే సమాజ ప్రగతికి సూచిక అని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు.
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు!
Kothagudem: భారతదేశ తొలి ప్రధానమంత్రి స్వర్గీయ పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని నిర్వహించే బాలల దినోత్సవ వేడుకలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనంలోని సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు.
ముందుగా జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ వేణుగోపాల్ బాలల సమక్షంలో బెలూన్స్ ఎగిరివేసి, జ్యోతి ప్రజ్వల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారిని కె. ఎం. తార మాట్లాడుతూ బాలల ప్రాధాన్యత, వారి హక్కులు, విద్య, ఆరోగ్యం, పోషకాహారం, సమగ్ర అభివృద్ధి, బాలల సంక్షేమం వంటి అంశాలపై కార్యక్రమంలో విస్తృతంగా చర్చించారు.
ఈ చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ సభ్యులు సుమిత్ర దేవి, సాధిక్ పాషా, అంబేద్కర్లు మాట్లాడుతూ బాలలే దేశ భవిష్యత్తుకు పునాదులని, నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని పేర్కొన్నారు. ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, మెరుగైన ఆరోగ్యం, పౌష్టికాహారం, సురక్షితమైన వాతావరణం కల్పించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
మహిళా, శిశు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలు, ఐసీడీఎస్, అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలు, పిల్లల ఎదుగుదల, పోషకాహార స్థితిగతుల మెరుగుదల వంటి అంశాలపై కూడా అవగాహన కల్పించారు. ప్రతి చిన్నారి ఆరోగ్యంగా, ఆనందంగా, ఆత్మవిశ్వాసంతో ఎదిగేలా అవసరమైన వసతులు, అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని వివరించారు.
మహిళా, శిశు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలు, ఐసీడీఎస్, అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలు, పిల్లల ఎదుగుదల, పోషకాహార స్థితిగతుల మెరుగుదల వంటి అంశాలపై కూడా అవగాహన కల్పించారు.
ప్రతి చిన్నారి ఆరోగ్యంగా, ఆనందంగా, ఆత్మవిశ్వాసంతో ఎదిగేలా అవసరమైన వసతులు, అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో బాలలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకర్షించాయి అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన అతిధులచే బహుమతులు ప్రధానం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారిని హరి కుమారి, నేషనల్ న్యూట్రిషన్ మిషన్ జిల్లా సమన్వయకర్త పొనుగోటి సంపత్, జిల్లా మహిళా సాధికారికత కోఆర్డినేటర్ సంతోషి రూప, డీసీపీయు సిబ్బంది, చిల్డ్రన్ హెల్ప్ లైన్ సిబ్బంది, శిశు గృహ సిబ్బంది, జిల్లాలోని వివిధ పాఠశాలల కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.




