Kunavaram: జాహ్నవి మృతి ఘటనపై బాలల సంక్షేమ బృందం విచారణ!

Kunavaram: పోలవరం జిల్లా కూనవరం మండలం కోతులగుట్ట గురుకుల పాఠశాలలో విద్యార్థిని జాహ్నవి మృతి ఘటనపై హైకోర్టు ఆదేశాలతో బాలల సంక్షేమ బృందం విచారణ చేపట్టింది.

RAJESH REDDY, CHINTOOR
Published on: 18 Sept 2026 11:59 AM IST
Kunavaram
X

Kunavaram: జాహ్నవి మృతి ఘటనపై బాలల సంక్షేమ బృందం విచారణ!

Kunavaram: పోలవరం జిల్లా కూనవరం మండలం కోతులగుట్ట గురుకుల పాఠశాలలో 7వ తరగతి విద్యార్థిని తెల్లం జాహ్నవి మృతి ఘటన పై బాలల సంక్షేమ బృందం బి హరి వెంకటరమణ, డాక్టర్ ఎస్ శ్యామ్ కుమార్ విచారణ చేపట్టారు..హైకోర్టు ఆదేశాల మేరకు విశాఖపట్నం బాలల సంక్షేమ బృందం గురువారం కోతులగుట్ట గురుకుల పాఠశాలను సందర్శించింది.విద్యార్థులతో మాట్లాడి జాహ్నవి మృతి ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించింది.అనంతరం జాహ్నవి స్వగ్రామమైన పల్లూరుకు వెళ్లి ఆమె తల్లిదండ్రులను కలిసి వివరాలు అడిగి తెలుసుకుంది.విచారణ పూర్తయిన అనంతరం నివేదికను హైకోర్టుకు సమర్పిస్తామని చైల్డ్ కమిటీ సభ్యులు బి. హరి వెంకటరమణ, డా. ఎస్. శ్యామ్ కుమార్ తెలిపారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR