Chandrugonda: చంద్రుగొండ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన డి. విజయకుమారి!

Chandrugonda: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ పోలీస్ స్టేషన్‌లో నూతన ఎస్సైగా డి. విజయకుమారి బాధ్యతలు స్వీకరించారు. శాంతిభద్రతలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.

SK MAHABOOB JANI, JULURPADU
Published on: 15 Oct 2026 9:37 PM IST
Chandrugonda
X

Chandrugonda: చంద్రుగొండ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన డి. విజయకుమారి!

చంద్రుగొండ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ పోలీస్ స్టేషన్‌లో నూతన సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై)గా డి. విజయకుమారి గురువారం బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తామని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

మహిళల భద్రత, నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదురైనా నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని సూచించారు.

ప్రజల సహకారంతో చంద్రుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతలను కాపాడేందుకు కృషి చేస్తామని ఎస్సై డి. విజయకుమారి తెలిపారు.

SK MAHABOOB JANI, JULURPADU

SK MAHABOOB JANI, JULURPADU