Palwancha: పాల్వంచలో యువతిపై లైంగిక దాడి.. ఆటో డ్రైవర్‌పై కేసు నమోదు!

Palwancha: పాల్వంచలో ఉపాధి కోసం వచ్చిన యువతికి పని ఇప్పిస్తానని నమ్మించి ఆటో డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 12 Nov 2026 1:24 PM IST
Palwancha
X

Palwancha: పాల్వంచలో యువతిపై లైంగిక దాడి.. ఆటో డ్రైవర్‌పై కేసు నమోదు!

Palwancha: ఉపాధి కోసం పట్టణానికి వచ్చిన యువతిపై ఆటో డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడం పాల్వంచలో కలకలం రేపింది. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పాల్వంచ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసులకు అందిన ఫిర్యాదు వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 19 ఏళ్ల యువతి ఉపాధి కోసం పాల్వంచకు వచ్చింది. కూలి పని కోసం ఎదురుచూస్తున్న ఆమెను గమనించిన ఆటో డ్రైవర్ నరసింహారావు పని ఇప్పిస్తానని నమ్మబలికాడు. అనంతరం ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత బాధితురాలిని అక్కడే వదిలి వెళ్లిపోయినట్లు తెలిపింది.

ఈ ఘటనపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు తెలిసింది. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN