Vemsuru: వేంసూరు వద్ద కారు, బడా దోస్త్ వాహనం ఢీ.. తప్పిన పెను ప్రాణాపాయం!
Vemsuru: వేంసూరు ఎగ్జిట్ సమీపంలోని గ్రీన్ఫీల్డ్ హైవేపై బుధవారం ఉదయం అతివేగంతో కారు, బడా దోస్త్ వాహనం ఢీకొన్నాయి.
Vemsuru: వేంసూరు వద్ద కారు, బడా దోస్త్ వాహనం ఢీ.. తప్పిన పెను ప్రాణాపాయం!
వేంసూరు: ఒక కారు బోల్తా.. మరో వాహనం ముందు భాగం ధ్వంసంవేంసూరు ఎగ్జిట్ సమీపంలో రోడ్డు ప్రమాదం.స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులవేంసూరు.వేంసూరు ఎగ్జిట్ సమీపంలోని గ్రీన్ఫీల్డ్ హైవేపై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.ఉదయం 10:04 గంటల సమయంలో అతివేగం కారణంగా క్రెటా కారు,బడా దోస్త్ వాహనం పరస్పరం ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో క్రెటా కారు బోల్తా పడగా,బడా దోస్త్ వాహనం ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది.ఢీకొన్న వేగానికి రెండు వాహనాలు రహదారి పక్కనున్న ROW ప్రాంతంలోకి దూసుకెళ్లాయి.అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణాపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.వాహనాల్లో ప్రయాణిస్తున్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.సమాచారం అందుకున్న అంబులెన్స్ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని అత్యవసర వైద్య సహాయం అందించారు.




