Bayyaram: జగ్గుతండాలో ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకంపై ప్రచారం!
Bayyaram: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం జగ్గుతండాలో ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకంపై సర్పంచ్ బొల్లి జయంతి వెంకటకృష్ణ ప్రచారం నిర్వహించారు.
Bayyaram: జగ్గుతండాలో ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకంపై ప్రచారం!
Bayyaram: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం జగ్గుతండా గ్రామపంచాయతీలో ఈరోజు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై సర్పంచ్ బొల్లి జయంతి వెంకటకృష్ణ ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ బొల్లి జయంతి వెంకటకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం పేదల కోసం ప్రవేశపెడుతున్న పథకాలలో భాగంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఎంతో గొప్పదని, కుటుంబాన్ని పోషించే వ్యక్తి మరణించినప్పుడు కుటుంబానికి ఆర్థిక సాయం అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం అని అన్నారు.
కావున ప్రజలందరూ కూడా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో జరుగుతున్న బీమా పథకం రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క వివరాలని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా అన్నారు, ఈ పథకానికి సంబంధించి వివరాల కోసం స్థానిక గ్రామపంచాయతీ సిబ్బందిని సంప్రదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గుంజ వీరస్వామి గారు, వార్డు సభ్యులు కండ్రాతి యాకేష్, నాయకులు తునికిపాటి నాగేందర్, యెలుగేటి సునీల్, కాసం లోకేష్ స్వామి , పంజలా వెంకటేష్,ముద్దంగుల ఆనంద్, మందనపు వెంకన్న, ఫజల్ పాషా, సిద్దు, లలిత, వేముల యాకేష్, సైదమ్మా , గ్రామ సెక్రటరీ, గ్రామ పంచాయతీ సిబ్బంది పార్వతి, వెంకన్న గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




