Kothagudem: తాగి వాహనం నడిపితే జైలుకే ఎస్ హెచ్ ఓ మేడ ప్రసాద్ హెచ్చరిక!

Kothagudem: బూర్గంపహాడ్ మండలంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. తాగి వాహనం నడిపితే జైలు శిక్ష తప్పదని SHO మేడ ప్రసాద్ హెచ్చరించారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 1 Oct 2026 7:25 AM IST
Kothagudem
X

Kothagudem: తాగి వాహనం నడిపితే జైలుకే ఎస్ హెచ్ ఓ మేడ ప్రసాద్ హెచ్చరిక!

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని ప్రధాన అంబేద్కర్ కూడలిలో SHO మేడ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వాహనదారులు తప్పనిసరిగా వాహన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడిపితే వాహనాలను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, జైలు శిక్షలు కూడా ఉంటాయి అని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.