Burgampahad: ఎమ్మెల్యే సమీక్షకు అధికారుల డుమ్మా: నాలుగు శాఖలు గైర్హాజరు!
Burgampahad: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నిర్వహించిన సమీక్ష సమావేశానికి నాలుగు శాఖల అధికారులు గైర్హాజరు కావడం కలకలం రేపింది.
Burgampahad: ఎమ్మెల్యే సమీక్షకు అధికారుల డుమ్మా: నాలుగు శాఖలు గైర్హాజరు!
బూర్గంపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలంలో స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన అధికారుల సమీక్ష సమావేశానికి నాలుగు శాఖల అధికారులు గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించాల్సిన కీలక సమావేశానికి అధికారులు హాజరుకాకపోవడం వారి పనితీరుపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది.
సమావేశానికి గైర్హాజరైన శాఖల్లో ఎక్స్ఛేంజ్ శాఖ, ఆర్టీఏ శాఖ, ఆర్ అండ్ బీ శాఖతో పాటు మరో శాఖ అధికారి ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే స్థాయిలో నిర్వహించే సమీక్ష సమావేశానికే అధికారులు హాజరుకాకపోతే సామాన్య ప్రజల సమస్యలకు పరిష్కారం ఎప్పుడు లభిస్తుందనే ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలపై సమీక్షలు నిర్వహిస్తుంటే సంబంధిత అధికారులు గైర్హాజరు కావడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమా? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అధికారుల గైర్హాజరుకు కారణాలేమిటి? ముందస్తు సమాచారం ఇచ్చారా? అనుమతితోనే గైర్హాజరయ్యారా? లేక సమీక్ష సమావేశాన్ని తేలికగా తీసుకున్నారా? అనే అంశాలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రజా సమస్యలపై సమీక్షకు పిలిస్తే అధికారుల గైర్హాజరు.. మరి ప్రజలకు జవాబుదారీ ఎవరు?* గైర్హాజరైన శాఖల అధికారులపై ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.




