Laxmipuram: లక్ష్మీపురంలో అక్రమ పార్కింగ్: ప్రమాదాల జోరు!

Laxmipuram: లక్ష్మీపురంలో అక్రమ వాహనాల పార్కింగ్‌పై స్థానికులు ఆగ్రహం. అధికారుల నిర్లక్ష్యం ప్రమాదాలకు దారితీస్తోందని, చర్యలు తీసుకోవాలని డిమాండ్.

RAVI, BURGAMPAD AREA
Published on: 29 Oct 2026 3:51 PM IST
Laxmipuram
X

Laxmipuram: లక్ష్మీపురంలో అక్రమ పార్కింగ్: ప్రమాదాల జోరు!

Laxmipuram: లక్ష్మీపురం గ్రామంలో ట్రాఫిక్ నిబంధనలు అమలవుతున్నాయా? లేక బోర్డులు పెట్టడంతోనే పోలీసుల బాధ్యత పూర్తయిందా? అన్న ప్రశ్నలు స్థానికంగా వినిపిస్తున్నాయి. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో పాటు ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో బూర్గంపాడు ఎస్సై గతంలో ఈ ప్రాంతంలో నో పార్కింగ్ బోర్డులు ఏర్పాటు చేశారు. అయితే కొద్దిరోజుల పాటు నిబంధనలు పాటించిన వాహనదారులు, ప్రస్తుతం మళ్లీ యథేచ్ఛగా వాహనాలను పార్కింగ్ చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

బోర్డుల ముందే వాహనాలు.. నిబంధనలకు తిలోదకాలు!

నో పార్కింగ్ బోర్డులు ఉన్న చోటే వాహనాలను నిలిపివేస్తుండటం గమనార్హం. ఒకవైపు వాహనాల రద్దీ, మరోవైపు ఇష్టానుసారంగా పార్కింగ్ చేయడంతో ప్రమాదాల ముప్పు పెరిగే అవకాశం ఉంది. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం ఏర్పాటు చేసిన బోర్డులకే విలువ లేకుండా పోతే నిబంధనలు అమలయ్యేది ఎలా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అసలు నో పార్కింగ్ బోర్డులు ఏమయ్యాయి?

గతంలో ఏర్పాటు చేసిన నో పార్కింగ్ బోర్డుల

RAVI, BURGAMPAD AREA

RAVI, BURGAMPAD AREA